వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటికీ ఓటు నమోదు చేసుకోవచ్చు. ఓటు నమోదు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిలిపివేయలేదని ఎన్నికల కమిషన్ తాజాగా తెలిపింది. ఈనెల 6 వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి ముసాయిదా జాబితా ప్రకటించామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మార్చి 14 వరకు వచ్చే అభ్యంతరాలు, వినతులు, కొత్త దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్ 4న తుది జాబితా ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

అందుకే అర్హులైన వారు ఓటు కోసం ఫారం 18 సమర్పించాలని సీఈవో పేర్కొన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండి.. పట్టభద్రులై మూడేళ్లయిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మూకుమ్మడిగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అయితే కుటుంబ సభ్యులందరివి కలిపి ఒకరు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు, ధ్రువీకరణ పత్రాల్లో అనుమానం వస్తే సిబ్బందే దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించాలని, వారికి కార్యాలయానికి రమ్మనవద్దని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: