మైక్రో సాఫ్ట్ సీఈవో గా మన తెలుగు వ్యక్తి సత్యనాదెళ్ల ఉన్న విషయం తెలిసిందే. ఆయన వార్షిక వేతనానికి సంబంధించి న వార్త సంచలనం సృష్టిస్తోంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం 2018-19 ఆర్థిక సంవత్సరానికి 42.9 మిలియన్ల డాలర్లు.. అంటే మన రూపాయాల్లో చెప్పాలంటే సుమారు 300 కోట్ల రూపాయలు.. అంటే నెలకు పాతిక కోట్లు అన్నమాట.


ఇంకా చెప్పాలంటే రోజకు 83 లక్షల వరకూ ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటంటే.. సత్య నాదెళ్ల వేతనం గత ఏడాదితో పోలిస్తే 66 శాతం పెరిగిందట. ఈ వేతనాన్ని ఎలా లెక్కేశారంటే.. ఆయన సాధారణ జీతంతో పాటు.. ఆయనకు ఇచ్చే కంపెనీ షేర్లు విలువ కలిపి లెక్కేశారు. సత్యనాదెళ్ల ఈ వేతనంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకునే సీఈవోల్లో ఒకరుగా నిలిచారు.


సత్య నాదెళ్ల తరహాలోనే మరో అద్భుత కంపెనీ యాపిల్ సీఈవో టిమ్ కుక్ 15.7 మిలియన్ డాలర్ల వేతనం తీసుకుంటున్నారు. మరో సాఫ్ట్ వేర్ దిగ్గజనం గూగుల్ సీఈవో సుందర్ పిచై దాదాపు 2 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నారు. నాదెళ్ల వ్యూహాత్మక నాయకత్వంతో వినియోగదారులను ఆకట్టుకోవడం వల్ల కంపెనీ స్థితిగతులే మారిపోయాయని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.


సత్య నాదెళ్ల రాకతో సంస్థ కొత్త పుంతలు తొక్కుతోందని మైక్రోసాఫ్ట్ డైరెక్టర్లు మెచ్చుకున్నారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఐదేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టారు. 2017-18లో ఆయన 25.8 మిలియన్ డాలర్ల వేతనం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: