స్మార్ట్ ప్రపంచంలో షియోమీ సంస్థ ఏ విధంగా దూసుకపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షియోమి సంస్థ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ లతో పాటు, స్మార్ట్ వాచ్, ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ ట్రిమ్మర్ లాంటి వివిధ ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా టెలివిజన్ రంగంలో ఎడ్జ్ టు ఎడ్జ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ డిస్ ప్లే ఈ సంవత్సరం తన టీవీ ని విడుదల చేసింది.

టీవీ ద్వారా దృశ్యాలు గాలిలో తేలుతూ ఉన్న అనుభూతిని కలిగించే విధంగా టెక్నాలజీని రూపొందించింది. పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సంస్థ ఈ టీవీ ని ఆవిష్కారించింది షియోమీ సంస్థ. ఈ టీవీ లోని 55 అంగుళాల సైజులో మాత్రమే ఈ సంస్థ తీసుకువచ్చింది. ఇక ఈ టీవీ ఆన్ చేసినప్పుడు మాత్రమే కాకుండా, ఆఫ్ చేసిన సమయంలో కూడా ఆర్ట్ పీస్ లా కనిపించే విధంగా షియోమీ సంస్థ టీవీ ను రూపొందించింది. వీటిని ఎక్కడైనా షాపింగ్ మాల్స్, మ్యూజియం, థియేటర్స్ లలో బాగా ఉపయోగపడుతుందని షియోమీ కంపెనీ అధికారులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం మామూలుగా ఉన్న టీవీ ల మాదిరి కాకుండా ఈ టీవీ కి సంబంధించిన అన్ని ప్రాసెసింగ్ యూనిట్లను దానికి బేస్ స్టాండ్ లో ఎంతో సృజనాత్మకంగా రూపొందించారు. అలా ఉంది కాబట్టే ఈ టీవీ చూడడానికి పూర్తిగా పారదర్శకంగా నిర్మించారు. నేటి నుంచి చైనా దేశంలో ఈటీవీ అమ్మకాలు మొదలు కాబోతున్నాయి. ఈటీవీ ధర విషయానికి వస్తే ఏడు వేల డాలర్లు గా కంపెనీ నిర్ణయించింది. ఇది మన భారతదేశ కరెన్సీలో ఐదు లక్షలకు పైగా పలుకుతోంది. భారతదేశంలో ఎప్పుడు ఈటీవీ రిలీజ్ అవుతుందో ఇంకా స్పష్టత రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: