మన అనుకున్న వాళ్లకు ఏదైనా కష్టం వస్తే ఎంతకైనా తెగిస్తారు.. ఇక సొంత వాళ్లకు కష్టం వస్తే ఇక పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు కన్నీరు పెట్టుకుంటే అతి దారుణ పరిణామాలు ఎదురవుతాయి.అలాంటిది ఓ కుర్రాడు తన తల్లి కంటతడి పెట్టిందని బాధతో ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు. అది కూడా మైనర్ బాలుడు. తన తల్లిని ఓ వ్యక్తి హింసిస్తున్నారు అనే కోపంతో పక్కా ప్లాన్ వేసి మరీ కూరంగా చంపేశారు..


ఓ మైనర్ బాలుడు తన తల్లి ప్రియుడిని అత్యంత దారుణంగా పథకం ప్రకారం హత్య చేశాడు. తల్లి చేసిన పనికి 17 ఏళ్ల కుర్రాడు హంతకుడిగా మారాడు.. వివరాల్లోకి వెళితే..గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన బాలుడి తల్లి కొన్నేల్ల క్రితం ప్రియుడితో కలిసి పారిపోయింది. కొద్ది రోజుల తర్వాత అతని నిజస్వరూపం బయటపడింది. ఆమెతో ప్రియుడు గొడవపడుతూ అడ్డు వచ్చిన కుర్రాడిని కొడుతూ వచ్చాడు. ప్రతి రోజూ ఇద్దరిని చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. 


దాంతో అతను తల్లి ప్రియుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. మే 17వ తేదీన బైక్ మీద అతన్ని నిందితుడు నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు.. అతనితో కాసేపు ముచ్చట్లు పెట్టాడు. అనంతరం మాటకు మాటా పెరగడంతో కాస్త గొడవ పెద్దదిగా నే అయ్యింది.. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపాడు. వరుసగా కత్తితో పొడుస్తూ వచ్చాడు.అతను చనిపోయాడని ధ్రువీకరించుకున్న తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.. ఈ క్రమంలో ఆ బాలుడి పేరు బయటకు రావడంతో ఇప్పుడు కేసు మరో మలుపు తిరిగింది. అతను తన నేరం అంగీకరించాడు. ప్రతి రోజు అతను తననూ తన తల్లినీ చిత్రహింసలకు గురిచేసేవాడని, అందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: