
అయితే గాయిత్రి తన ప్రేమ విషయాన్ని తండ్రి జయరామ్‌కు చెప్పింది. ఇక అబ్బాయి ఎవరో.. ఏంటో తెలుసుకున్న జయరామ్.. ఆ అబ్బాయిది మన కులం కాదని.. మనకంటే తక్కువ కులం అని.. రాఘవేంద్రను మర్చిపోవాలని కూతురి గాయత్రికి చెప్పాడు. ఇక తండ్రి మాటకు ఆమె అంగీకరించలేదు. అయితే ఈ విషయంలో తండ్రీకూతురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగినట్లు సమాచారం.
గాయిత్రిని ఎంత మందలించినా రాఘవేంద్రతో మాట్లాడుతుందని భావించిన జయరామ్ పొలానికి వెళుతున్నానని చెప్పారు. తండ్రి మధ్యాహ్నం భోజనం తీసుకుని రావాలని కూతురికి చెప్పి జూన్ 18న పొలానికి వెళ్ళింది. అదే సమయంలో మళ్లీ ఇద్దరి మధ్య రాఘవేంద్ర గురించి వాగ్వాదం జరిగింది. రాఘవేంద్రను మర్చిపోలేనని కూతురు చెప్పడంతో తీవ్ర కోపోద్రేకంతో జయరామ్ కన్నకూతురిపై గొడ్డలితో దాడి చేశారు. గాయిత్రి మెడపై నరకడంతో గాయమై రక్తం కారుతూ ఉన్న భయంతో పరుగులు తీసింది. ఇక ఆమెను వెంబడించి గొడ్డలితో జయరామ్ నరికి చంపారు.
జయరామ్ అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అయితే కులం తక్కువ వ్యక్తిని ప్రేమించినందుకు తన కూతురిని నరికి చంపానని తెలిపాడు. గాయిత్రి మృతదేహం పొలంలోనే ఉందని చెప్పారు. పోలీసులు జయరామ్‌ను వెంటబెట్టుకుని పొలం దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే రక్తపు మడుగులో.. మెడపై తీవ్ర గాయమై గాయత్రి మృతి చెందింది. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహన్నీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జయరామ్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.