చాలామంది ప్రేమల్లో వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంవల్ల ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ ఆడపిల్లల విషయంలో అయితే మరి ఎక్కువగా నిబంధనలు పెట్టి ఉంచుతారు. అయితే ఆ యువతి ఒక వ్యక్తిని ప్రేమించినందుకు 25 సంవత్సరాలు తను ఒక రూములో బందీగా చేసింది ఆమె తల్లి. ఇది మానవ చరిత్రలోనే చాలా విషాదకరమైన ఘటనలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఘటన గురించి వింటే నే కన్నీరు వస్తుంది. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది అయితే కాదు. 19వ శతాబ్దంలో ఫ్రాన్సు దేశంలో జరిగినది.. వివరాల్లోకి వెళితే 1876 లో ఫ్రాన్సు దేశంలో ప్లాన్ బ్లాంచే నియర్ అనే యువతి ఒక యువకుని ప్రేమించింది. అప్పుడు ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ప్రేమించిన టువంటి వ్యక్తి ఆమె తల్లికి నచ్చలేదు. దీంతో తన కూతురు ప్రేమను అంగీకరించలేదు. అంతే కాకుండా మరొక వ్యక్తితో ఆమెను వివాహం చేయాలనుకుంది. దీంతో సదరు యువతి నిరాకరించింది. తనకు ప్రేమించిన వ్యక్తి కావాలని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆ తల్లి తన కొడుకు సహాయముతో ఆ యువతిని చీకటి గదిలో బందీ చేసింది. గొలుసులతో కట్టింది. ఆమె చేసిన చిత్రహింసలు తట్టుకోలేక ఆ యువతి ప్రతిరోజు రోదించేది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి