
ఆ అజీర్తి సమస్యను పోగొట్టుకోవడానికి పక్కనే ఉన్న మరో షాపులో చల్లటి ఫ్రూట్ జూస్ ని తెచ్చుకొని కర్పగం మరియు ఆమె కుమార్తె దర్శిని లు తాగారు. సమస్య ఇంకాస్త పెద్దదై కడుపునొప్పి తలెత్తింది. పరిస్థితి విషమించడం తో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే వారిరువురు చనిపోయారు. పోలీసులు కేసునమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. వారి ఇరువురికి పంచనామా చేయవలసి ఉంది పంచనామా తరువాత వారి మరణానికి గల కారణాలను బహిర్గతం చేస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అయితే చికెన్ గ్రేవీ లో కానీ లేదా కూల్ డ్రింక్ లో కానీ ఏదో ఒకటి విషతుల్యమై వుండవచ్చని అందరు భవిస్తూ ఉన్నారు.
కోవిల్‌పట్టి ఆర్‌డిఓ వి శంకరనారాయణన్ మాట్లాడుతూ కర్పగం కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు అయితే కర్పగం మరియు ఆమె కూతురు దర్శిని లు భోజనం చేసేటప్పుడు ఆమె కుమారుడు కూడా ఆ చికెన్ గ్రేవీ ని తిన్నారు. అతని పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది ఎందుకంటే అతడు ఆ శీతల పానీయాన్ని తిసునేందుకు నిరాకరించాడు. అందువల్లనే ఆమె కుమారుడు కి మరణం సంభవించలేదు. అయితే ఫుడ్ సేఫ్టీ అండ్ కంట్రోల్ సంస్థ వారు ఫుడ్ శాంపిల్స్ ను కర్పగం తెచ్చిన హోటల్ నుండి తీసుకున్నారు