మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మ‌హిళ‌ల ర‌క్షించేందుకు ఎన్ని చ‌ట్టాల‌ను తీసుకొచ్చిన అవి వారికి చుట్టాలుగానే మారిపోతున్నాయి. ర‌క్షించాల్సిన బ‌క్షించే నేటి త‌రుణంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌నే క‌రువైపోతున్న‌ది. భ‌ర్త మోసం చేసాడ‌ని ఓ మ‌హిళ అత‌నిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వెళ్లినది. ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన మ‌హిళ‌పై అత్యాచారం చేసాడు ఓ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్‌. ఇది సినిమాల్లో జ‌రిగిన ఘ‌ట‌న కాదు.. వాస్త‌వంగా జ‌రిగిన ఘ‌ట‌న‌.

ర‌క్షించాల్సిన ఎస్ఐ ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ‌డంతో  ఆ మ‌హిళ గ‌ర్భం దాల్చ‌డంతో బ‌ల‌వంతంగా ఆమెకు అబార్ష‌న్ చేయించాడు ఎస్ఐ.  ఫ‌లితంగా అత‌నితో పాటు 8 మందిపై కూడా కేసు న‌మోదైన‌ది. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని క‌న్యాకుమారి జిల్లా క‌ళియ‌కొవిలై పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ ప్రాంతానికి చెందిన మ‌హిళ (32) కు పెళ్లి జ‌రిగి తొమ్మిదేండ్ల కూతురు క‌ల‌దు. భార్య‌భ‌ర్త‌ల మ‌న‌స్పార్థం కార‌ణంగా భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న‌ది. ఆ త‌రువాత మ‌రొక వ్య‌క్తిని ప్రేమించి పెళ్లాడింది ఆ మ‌హిళ‌. రెండ‌వ భ‌ర్త కూడా ఆమెను మోసం చేయ‌డంతో ఫిర్యాదు చేయ‌డం కోసం ప‌ళుగ‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు వెల్లిన‌ది ఆ మ‌హిళ‌.

ఫిర్యాదు చేసేందుకు పీఎస్ కు వ‌చ్చిన మ‌హిళ‌పై క‌న్నేసాడు ఎస్ఐ సుంద‌ర‌లింగం. ఆమెకు సాయం చేస్తున్న‌ట్టు న‌టించి ప‌లుచోట్ల‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. చివ‌రకు ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో.. విష‌యం తెలుసుకున్న ఎస్ ఐ సుంద‌ర‌లింగం (40) త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆమెను ఆటోలో పులియ‌రంగిలోని క్లినిక్ లో డాక్ట‌ర్ కార్మల్ రాణి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. వైద్య ప‌రీక్ష‌లు కోస‌మే అని న‌మ్మ‌బ‌లికించి ఆ మ‌హిళ‌కు అబార్ష‌న్ చేయించాడు ఆ ఎస్ఐ.

ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలు క‌క‌లియ‌కోవిల్‌, మార్తాండం పోలీస్ స్టేష‌న్‌ల‌లో డీఎస్పీ, ఎస్పీ కార్యాల‌యాల‌లో ప‌లుమార్లు ఫిర్యాదు కూడా చేసింది స‌ద‌రు మ‌హిళ‌. ఎవ‌రూ కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోవంతో కుళిత్తురై కోర్టును ఆశ్ర‌యించిన‌ది. బాధితురాలు ఫిర్యాదుపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌మూర్తి.. ఎస్ఐ సుంద‌ర‌లింగం, డాక్ట‌ర్ కార్మ‌ల్ రాణి,స్నేహితులు గ‌ణేష్‌కుమార్‌, అభిషేక్‌, దేవ‌ద‌రాజ్ ఇలా 8 మందిపై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాల‌తో మార్తాండం మ‌హిళా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసేందుకు మొద‌లుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: