తండ్రి అయినా సరే కూతురు పెళ్లి ఎంతో అంగరంగ వైభవం గా చేయాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే  ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తే ఇక కూతురు ఎంతో సంతోషంగా ఉంటుంది అని భావిస్తాడు. కూతురు పెళ్లికి తెలిసీ తెలియని బంధువులు అందరికీ కూడా ఆహ్వానం పంపిస్తూ ఉంటాడు. బంధుమిత్రులందరి సమక్షంలో తమ కూతురు పెళ్లి చేయాలని అనుకుకుంటారు. ఇక్కడ ఓ తండ్రి అలాగే భావించాడు. వైభవంగా ముస్తాబు చేయబడిన వేదికపై కూతురు పెళ్లి జరుగుతుంది.


 ఈ క్రమంలోనే కూతురు దూరమైపోతుంది అన్న బాధ ఒకవైపు.. కూతురు పెళ్లి జరుగుతుంది అన్న సంతోషం మరోవైపు ఆ తండ్రి మనసులో ఉంది. కానీ ఇంతలో ఊహించని విషాదకర ఘటన ఆ తండ్రి గుండె పగిలిపోయింది. సరిగ్గా పెళ్లి వేడుకలో జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడూ అని చెప్పాలి.


 విశాఖపట్నంలోని మధురవాడ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శివాజీ సృజనల వివాహం ఇటీవలే జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ పిలిచి సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం వివాహం జరుగుతున్న సమయంలో జీలకర్రబెల్లం పెడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో  బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే సృజన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. 

అయితే వధువు సృజన మృతితో అప్పటివరకు ఎంతో సందడిగా బాజాభజంత్రీలు సవ్వడి మధ్య బంధుమిత్రులందరికీ చిరునవ్వుల మధ్య కళకళలాడి పోయినా పెళ్లి మండపం మొత్తం ఒక్కసారిగా బోసిపోయింది. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: