
ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నాగారం లోని అంబేద్కర్ నగర్ కు చెందిన శ్రీకాంత్ అనే 30 ఏళ్ల వ్యక్తి, జాడి సంగీత చిన్నప్పటి నుంచి స్నేహితులు. సంగీతకు తల్లిదండ్రులు తోబుట్టువులు ఎవరూ లేరు. వివాహం కూడా కాలేదు. అయితే ప్రస్తుతం అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న యువతీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే శ్రీనివాస్ కి వివాహం జరిగినప్పటికీ కొన్ని ఏళ్ల క్రితమే భార్య అతని విడిచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. అతను కూడా కూలి పనులు చేస్తూ ఉంటాడు.
అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ శ్రీనివాస్ కొన్నేలుగా అటు సంగీతను వేధించడం మొదలుపెట్టాడు. అయితే గతంలో బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీకాంత్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇక ఇటీవలే రాత్రి సమయంలో సంగీత ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ తలుపులు కొడితే భయపడి ఆమె తరపు తెరవలేదు. మరోసారి అర్థరాత్రి 12 గంటలకు వెళ్లి తలుపు కొట్టాడు. అయితే అప్పటికే పథకం వేసుకున్న సంగీత శ్రీనివాస్ ను ఇంట్లోకి రానిచ్చి మాటల్లో పెట్టి అతని చేతులు కట్టేసి దారుణంగా కత్తితోపొడిచి హత్య చేసింది. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఇక ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనగా మారిపోయింది.