
కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమెకూ నిర్గాంత పోయే మరో వార్త తెలిసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.కాలిఫోర్నియాలోని శాండీయాగోకు చెందిన అనేస్సా రోసి భర్త ఆమెకు విడాకుల ఇవ్వడం కోసం కోర్టుకు వెళ్ళాడు. భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఆమె అంత సుముఖంగా లేదు. ఇంతలోనే భర్త చనిపోయాడు అన్న షాకింగ్ వార్త ఆమె చెవిన పడింది. దీంతో ఎంతగానో ఆవేదన చెందింది. చివరి చూపు కోసం అతడు ఇంటికి కూడా వెళ్ళింది. కానీ తల్లిదండ్రులు చివరి చూపుకు అంగీకరించలేదు. విడాకులు ఇచ్చేసిన బ్రతికే వాడేమో అని లోలోపల ఎంతో పాశ్చాత్తాప పడింది.
ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంతలో ఒక నిర్గాంత పోయే వార్త ఆమె చెవినా పడింది. చనిపోయాడు అనుకున్న భర్త చనిపోలేదు. ఇంకా బతికే ఉన్నాడు అన్న విషయం తెలిసి షాక్ కూ గురైంది. మెక్సికోలో మరో గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నట్లు తెలుసుకొని ఆఖరికి వేరే అమ్మాయితో ఉండేందుకు చనిపోయినట్లు నాటకం ఆడినట్లు తెలుసుకొని బాధపడింది. ఇక ఈ విషయాన్ని టిక్ టాక్ వేదికగా పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త తానేమి నాటకాలు ఆడలేదని విడాకులు ఇవ్వకపోవడంతోనే ఇలా చేశాను అంటూ అదే టిక్ టాక్ వేదికగా పంచుకోగా ఇది వైరల్ గా మారిపోయింది.