
ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత మనిషిలో ధైర్యం అనేది పూర్తిగా చచ్చిపోయింది. అందుకే చిన్న సమస్యలు కూడా పెద్దదిగానే కనిపిస్తున్నాయి అన్న విషయం అందరికీ అర్థమవుతుంది.. అందుకే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లో కూడా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. మల్లేశం అనే 27 ఏళ్ల యువకుడు జీవితం పై విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం అరణ్య రోదనగా విలపించింది అని చెప్పాలి.
కొర్పోల్ గ్రామానికి చెందిన మల్లేశం గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఎన్ని ఆసుపత్రులు పెరిగినప్పటికీ అతని ఆరోగ్యం మాత్రం బాగు కాలేదు. దీంతో ఇక అతను మనస్థాపంతో కృంగిపోయేవాడు. చివరికి జీవితం పై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక తన జీవితాన్ని అర్ధాంతరంగానే ముగించాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక పొలం వద్ద ఉన్న షెడ్డులోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటు వైపుకు వెళ్ళిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.