ప్రస్తుతం మనిషి టెక్నాలజీ యుగంలో దూసుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అందుబాటులోకి వచ్చిన అధునాతన   టెక్నాలజీ కారణంగా అటు మనిషి జీవనశైలిలో కూడా అనూహ్యమైన  మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రతి విషయంలో కూడా ఎంతో గొప్పగా ఆలోచించగలుగుతున్నాడు మనిషి. ఒకప్పటి మూఢనమ్మకాలను పూర్తిగా వదిలేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.. అయితే మూఢనమ్మకాలను అయితే వదిలేస్తున్నాడు కానీ సందర్భానుసారంగా ఎలా ప్రవర్తించాలి అనే విచక్షణ మాత్రం కోల్పోతున్నాడేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.


 ఎందుకంటే ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే మనుషులు తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఏ చిన్న సమస్య వచ్చిన ఆ సమస్యకు పరిష్కారం ఒకటే ఆత్మహత్య అనే విధంగా ఆలోచిస్తున్నారు మనుషులు  దీంతో చిన్నారి దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న సమస్యకు కుంగిపోయి అక్కడితో జీవితం అయిపోయింది అని భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి.



 14 ఏళ్ల బాలిక చిన్న కారణానికే బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా రాయ కోడ్ లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల అంజలి ఇటీవల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే కొత్త మొబైల్ కొని ఇవ్వాలని తల్లిదండ్రులను అడుగగా.. డబ్బులు లేవని తర్వాత కొనిస్తాము అని చెప్పారు. దీంతో మనస్థాపం  చెందిన అంజలి బావిలో దూకి సూసైడ్ చేసుకుందని గ్రామస్తులు తెలిపారు. కొత్త మొబైల్ కొని ఇవ్వమంటే తండ్రి మందలించడంతోనే బాలిక ఇలా చేసిందని స్థానికులు తెలిపారు. అయితే స్థానికులు అప్రమత్తమైనప్పటికీ అప్పటికే బాలిక ప్రాణం పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: