
అయితే ఇలాంటి దారుణ ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చిన అటు మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే అక్రమ సంబంధాలు కారణంగా జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గడం లేదు. ఇక్కడ ఒక యువకుడు తప్పు అని తెలిసిన వివాహితతో ఎఫైర్ పెట్టుకున్నాడు. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. బీర్పూర్ కు చెందిన వంశీ అనే యువకుడు తంగూర్ లో డ్రైవింగ్ స్కూల్ లో పనిచేస్తూ ఉంటాడు. అయితే తంగూర్ వైపు వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్ పై మారణాయుధాలతో వెంబడించి అతని తలపై బలంగా కొట్టారు.
దీంతో వంశీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక తర్వాత ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వంశీ హత్య వెనుక ప్రేమ, వివాహేతర సంబంధమే కారణం అన్న విషయాన్ని పోలీసులు తేల్చారు . వంశి అదే మండలానికి చెందిన యువతని ప్రేమించాడు. ఇద్దరు కలిసి తిరిగారు. కానీ యువతీ తల్లిదండ్రులు ఆమెకు మరొక వివాహం చేసారు. అయినప్పటికీ వంశీ కలుస్తూ ఉండేవాడు. తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. విషయం తెలిసి యువతి అత్తింటి వాళ్ళు వంశీని హెచ్చరించిన తీరు మారలేదు. దీంతో పథకం ప్రకారమే వంశీ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.