
కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా చిన్నచిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అంతేకాదు ఏకంగా ఒకరికి ఒకరు కష్ట సుఖాలలో తోడునీడగా ఉండాల్సిన కట్టుకున్న వారే.. ఏకంగా దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. మరీ ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో అయితే ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.
ప్రేమ వివాహం చివరికి రోడ్డు పాలు చేసింది. హైదరాబాదులోని రహమత్ నగర్ లో నివాసం ఉంటున్న ఒక యువతి బ్యూటీషియన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఆమెకు 2018లో చెన్నైలో ఉన్న సమయంలో యాకోత్పురాకు చెందిన ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇక అతనితో పరిచయం ప్రేమగా మారింది. ఇక ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అయితే ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు రెండేళ్ల తర్వాత వారి ప్రేమకు ప్రతిరూపంగా ఒక బాబుకు జన్మనిచ్చారు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం వీరి కాపురం సజావుగా సాగడం లేదు. ఇక భర్త భార్యను వేధించడంతోపాటు కొట్టడం మొదలుపెట్టాడు. ఇక ఇటీవల ఏకంగా భార్యకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో సదరు యువతీ రోడ్డున పడింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.