అగ్గిపుల్ల సబ్బు బిల్లా కాకి పిల్ల కవితకు కాదేది అనర్హం అని శ్రీ శ్రీ చెప్పిన మాటలను.. ఈ మధ్యకాలంలో ప్రేమికులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రొమాన్స్ చేయడానికి కాదేది అనర్హం అన్నట్లుగా ఎక్కడికి వెళ్లినా దుకాణం పెట్టేస్తూ ఉన్నారు. ఏకంగా పబ్లిక్ ప్లేస్లలో ఇలా లవర్స్ రొమాన్స్ తో రెచ్చిపోతూ ఉండడం ఎంతో మందికి ఇబ్బందికరంగా మారిపోయింది. ఏకంగా బస్సులు ట్రైన్లు అనే తేడా లేకుండా అన్నిచోట్ల ప్రేమికులు రెచ్చిపోతూనే ఉన్నారు. తమకు ఎక్కడ ప్రైవేట్ ప్లేస్ దొరకలేదు అన్నట్లుగా పబ్లిక్ ప్లేస్ లోనే ముద్దులు హగ్గులు అంటూ రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. ఇటీవల కాలంలో  మెట్రో స్టేషన్ లు పార్కులను కూడా వదలకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక మొన్నటి నుంచి ఏకంగా రోడ్డుపై బైక్ నడుపుతూ.. యువతి యువకులు ఇద్దరు కూడా రొమాన్స్ లో మునిగి తేలుతున్న వీడియోలు కూడా ఇటీవల కాలంలో వైరల్ గా మారిపోయాయి. ఎవరు ఏమనుకుంటే మాకేంటి అన్న చందంగా లవర్స్ ప్రవర్తన తీరు మారిపోయింది. అయితే అటు విమానంలో ప్రయాణించే వారు మాత్రం కాస్త హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే లవర్స్ మాత్రం ఇందుకు మినహాయింపు.


 ఇప్పుడు వరకు ట్రైన్ బైక్ పార్కులు లేదా బస్సుల్లో రొమాన్స్ లో మునిగి తెలియన లవర్స్ ని మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు కాస్త పాష్ గా ఫ్లైట్లోనే దుకాణం పెట్టేసారు లవర్స్. ఒక జంట ఏకంగా ఫ్లైట్ లో అందరి ముందే ఒకరిపై మరొకరు ఇష్టం వచ్చినట్లుగా పడుకున్నారు. తాము విమానంలో ఉన్నాము అన్న విషయాన్ని మరిచిపోయి ఇక దారుణంగా ప్రవర్తించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఇలా ఏకంగా తాము కూర్చున్న సీట్లోనే గట్టిగా హగ్ చేసుకుని.. ఆ లవర్స్ రొమాన్స్ లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారిపోయాయి. ఈ ఘటనపై నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: