గతంలో  ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాప్ లు, పర్మిట్ రూములు అంటూ మద్యం అమ్మకాలు వరదలా సాగేవి. అయితే ఆంధ్రా లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అమ్మకాలు అనేవి కొంత కంట్రోల్ లోకి వచ్చాయి అని కొంత మంది అనుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు లాంటి వాటిని నిషేధించడం తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య మళ్లీ ఈ బెల్ట్ షాపులు  తిరిగి మద్య ప్రియులకు అందుబాటు లోకి వచ్చాయని సమాచారం.


చంద్రబాబు గతంలో మొదటి సంతకం తోనే బెల్ట్ షాపులను రద్దు చేస్తానని  చెప్పడం జరిగింది. తీరా చూస్తే  ఆ తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలు విచ్చలవిడిగా పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చేసాయి‌. వాటితో పాటు పర్మిట్ రూములు కూడా వాటికి అదనంగా తోడయ్యాయి. దాంతో మద్యం మళ్లీ ఏరులా పారిందని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. అయితే 2019 ఎలక్షన్లకు ముందు జగన్ వీటిని కంట్రోల్ చేస్తానని చెప్పినా ఈ మద్య కాలంలో బెల్ట్ షాపులు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి.


ఒక పక్క ఈ బెల్ట్ షాపులపై దాడులు జరుగుతున్నా కూడా అవి మద్యం ప్రియులకు అందుబాటులోనే ఉంటున్నాయి. ఈ కారణం మీదనే ప్రభుత్వమే అఫీషియల్ గా మద్యం అమ్మకాలను మొదలు పెట్టింది. ప్రభుత్వం ఈ విధంగా మద్యం అమ్మకాలను అధికారికంగా మొదలుపెట్టడానికి వెనక ఉన్న కారణం మద్యం అమ్మకాలను కట్టడి చేయడానికే అంటున్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్లు.


అయితే ప్రభుత్వం ఈ మద్య మద్యం దుకాణాలలో డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టిందని సమాచారం. రాష్ట్రంలోని 2,934 మద్యం దుకాణాలలో ఆల్రెడీ ఈ డిజిటల్ చెల్లింపు విధానాన్ని మొదలు పెట్టారని అంటున్నారు. జూలై 8న అన్ని మద్యం దుకాణాలలో కలిపి 67,818డిజిటల్ చెల్లింపులు తో, 1.81కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని అంటున్నారు. నగదు చెల్లింపులకు కూడా అనుమతి ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: