మన భావోద్వేగాలను అడ్డు పెట్టుకుని మన దేశాన్నే నాశనం చేయడానికి విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నట్లుగా సమాచారం. అమెరికాలో పలు సందర్భాల్లో మన భారతీయులు గాయపడ్డారు, అలాగే చంపబడ్డారు కూడా. అలాంటి సందర్భాల్లో మన భారతదేశం అమెరికాకు ఎటువంటి బృందాన్ని అయినా పంపిందా, జోక్యం  చేసుకుంటానందా అని కొంతమంది  రాజకీయ నిపుణులు అడుగుతున్నారు. మరి అలాంటప్పుడు అమెరికా ఎందుకు మన భారతదేశంలోని మణిపూర్ విషయం లో జోక్యం చేసుకోవాలి అని వాళ్ళు అడుగుతున్నారు.


ఒక దేశపు అంతర్గత వ్యవహారంలో మరో దేశం ఆ దేశం ప్రమేయం లేకుండా జోక్యం చేసుకోకూడదు. కానీ ఇప్పుడు ఆ ఆంక్షలు దాటి అమెరికా భారత్ విషయంలో జోక్యం చేసుకోవడానికి చూస్తుంది. మణిపూర్ లోని కుకీలు అనబడే క్రైస్తవులకు అవమానం జరిగింది కాబట్టే మేము జోక్యం చేసుకుంటామని అడుగుతుంది అమెరికా. ఇలా అమెరికా ఇప్పుడు మోడీకి పెద్ద తలనొప్పిగా తయారైంది.


తాజాగా భారత్ కు సంబంధించిన మణిపూర్ విషయంలో మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా అని అమెరికా  మోడీని అడిగిందట. దానికి మన ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించలేదని సమాచారం. ఆ తర్వాత కూడా అమెరికా మణిపూర్ సంఘటనపై స్టేట్మెంట్స్, వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ వచ్చింది. మణిపూర్ లో ఈ మధ్య మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై కోర్టు ఎందుకు మత మార్పిడులకు గురవుతున్నారు అని అడిగితే విషయం బయటకు వచ్చింది.  


మేతి తెగ వాళ్ళకి రిజర్వేషన్ లేకపోవడం వల్ల మతం మార్చుకున్నారు. కుకీ తెగ వాళ్ళు ఆల్రెడీ మతం మార్చుకున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మేతి తెగ వాళ్ళు మతం మార్చుకుంటే రిజర్వేషన్ వస్తుంది. మారకపోతే రిజర్వేషన్ రాదు. దానికోసమే ఈ మేతి తెగ వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే వారికి రిజర్వేషన్ ఇవ్వాలని తీర్పునిచ్చింది కోర్టు. అయితే వాళ్లకి కూడా రిజర్వేషన్లు ఇస్తే మత మార్పిడులు జరగవు కాబట్టి ఇప్పుడు మణిపూర్ లో ఈ అల్లకల్లోలం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: