ఇంట్లో వండుకుంటే ఒకటే కూర అదే అడుక్కు తింటే 66 కూరలు అనేది ఒక సామెత. ప్రస్తుతం పాకిస్థాన్  పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూప్పకూలింది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. దేశ జనాభాలో 40 శాతం మంది పేదలే ఉన్నారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  ఇప్పుడు ఆదాయ వనరుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.


వాళ్లు వద్దనుకొని వెళ్లిన హిందూ ధర్మమే వారికి దిక్కయింది.  భారత దేశం నుంచి విడిపోయేనాటికి సిక్కులకు, హిందువులకి సంబంధించిన అనేక పవిత్రమైన ప్రదేశాలు పాకిస్థాన్ లో ఉండిపోయాయి.  ఆ సమయంలో అక్కడున్న హిందూ ఆలయాలను సైతం కూల్చేశారు.  అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పాకిస్థాన్ మరో కీలకమైన వ్యవహారం చేస్తోంది.
 

అదేంటంటే హిందూ ప్రదేశాలను చూడటానికి సందర్శకులను ఆహ్వానిస్తోంది. అంటే పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధులు, సిక్కులు, హిందువులు అక్కడికి వస్తే వాళ్ల ద్వారా ఆదాయం పొందవచ్చనేది వారి ఆలోచన. పాకిస్థాన్ లో ఎప్పుడైనా శ్రీలంక లాంటి పరిస్థితి ఎదురయ్యే ప్రమాద ముంది. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు కూడా ఆ దేశానికి హెచ్చరిక జారీ చేసింది. దేశాభివృద్ధికి తోడ్పడటానికి తగినంత ప్రజా వనరులు, ఆర్థిక బలం పాకిస్థాన్ లో లేవు.  మీ దేశ అభివృద్ధికి మీరే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరింది.


ఈ నేపథ్యంలో పాకిస్థాన్  స్కేర్ టేకర్ ఫారిన్ మినిస్టర్ జలియల్ అబ్బాస్ జిలానీ అమెరికా పర్యటనలో ఉండగా తమ  దేశంలో ఉన్న హిందూ ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తూ మీరు మా దేశానికి పర్యాటకానికి రండి అని వాళ్లని ఆహ్వానించారు. తద్వారా మాకు ఆదాయం వస్తోంది అని పేర్కొన్నారు. చివరకి హిందువుల, బౌద్ధుల పుణ్యక్షేత్రాల మీద  సంపాదించి తమ కష్టాలు తీర్చుకోవాలని  భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: