అమెరికా ఏదీ తనకు తానుగా చేయదు. ఏమి చేసినా తన చేతికి మట్టి అంటకుండా పక్క వాళ్ళతో చేయిస్తుంది. రష్యాను దెబ్బ కొట్టడానికి ఉక్రెయిన్ ని వాడింది. ఆఫ్ఘనిస్తాన్ లో బిన్ లాడెన్ ను లేపేయడానికి, అల్ జవహరిని లేపేయడానికి  పాకిస్తాన్ ని వాడింది. అయితే ఇప్పుడు నాటో ద్వారా తనను దెబ్బ కొట్టాలనుకుంటుంది అమెరికా అని రష్యా గట్టిగా నమ్ముతుంది.


ఇప్పటికే నాటో దేశాల్లోని చాలా దేశాలు తమ పై డ్రోన్లు పడుతున్నాయని గట్టిగానే చెప్తున్నాయి. అలా చెప్తూ చెప్తూ ఈ దేశాలన్నీ ఒక్కసారిగా రష్యా పై దాడి చేయబోతున్నాయి అని అనుమానిస్తుంది రష్యా. రష్యా గతంలో యూ ఎస్ ఎస్ ఆర్ గా ఉన్న  సందర్భం నుండి ముక్కలై బయటకు వచ్చిన దేశం. ఇప్పుడు రష్యా కూడా అదే విధంగా విడిపోవాలని భావిస్తున్నాయి అమెరికా, నాటో, యూరప్ దేశాలు. ఉక్రెయిన్ ను రష్యాపై దాడికి పంపింది అమెరికానే.


కానీ రష్యా ధాటికి నిలబడలేక ఉక్రెయిన్ తల్లడిల్లుతుంది. ఇక్కడ ఉక్రెయిన్ ఓడిపోవడం అంటే అమెరికా ఓడిపోయినట్టే. అలాగే నాటో, యూరప్ దేశాలు కూడా ఓడిపోయినట్లే. అందుకనే నాటో దేశాలు స్వయంగా తామే రష్యా పై దాడికి దిగడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్య నాటో దేశాలు ఆయుధాలను భారీగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఎందుకని కనుక్కుంటే రెండు కారణాలు కనిపిస్తున్నాయి.


ఒకటి  రష్యా మీద విజయం సాధించడానికి ఉక్రెయిన్ కు అందిస్తున్నాయి. మరొకటి ఒకవేళ ఉక్రెయిన్ ఓడిపోయే పరిస్థితిలో ఉంటే నాటో దేశాలు కూడా రంగంలోకి దిగి రష్యాను ఓడించాలని ఈ విధంగా చేస్తున్నాయి. ఇక్కడ ఉక్రెయిన్ ఓడిపోతే అమెరికా ఓడిపోయినట్లే. అమెరికా ఓడిపోతే నాటో, యూరోప్ దేశాలు కూడా ఓడిపోయినట్లే. ఇలా అవి గాని ఓడిపోయాయి అంటే ప్రపంచ దేశాల మీద అవి పట్టు కోల్పోతాయి. అలా జరగకూడదనే ఇప్పుడు నాటో దేశాలు రష్యా పై దాడి చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: