ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ఆయనపై పలు కేసులను నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధం చేసింది. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి జరిగింది అంటూ చంద్రబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది. హెరిటేజ్ కు, లింగమనేని రమేశ్ కు ప్రయోజనం చేకూర్చేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని సీఐడీ వాదిస్తోంది. సామాన్య ప్రజల నుంచి భూమిని సేకరించి లింగమనేని వద్ద ఒక్క గజం కూడా సేకరించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అలాగే రైతులు భూములు ఇవ్వకపోతే వాటిని గ్రీన్ జోన్‌గా  ప్రకటించింది టీడీపీ ప్రభుత్వం. అంటే వారు వ్యవసాయం చేసుకోవడానికి తప్ప అమ్ముకోవడానికి అనర్హులు. ఈ అంశాలపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో భువనేశ్వరి వ్యవహారం ఎందుకు వచ్చిందంటే. కరకట్ట వద్ద లింగమనేని రమేశ్  కు చెందిన ఇంటి కి చెల్లించిన అద్దెను దర్యాప్తు సంస్థ వివాదస్పదం చేయడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ లు హైకోర్టులో వాదనలు వినిపించారు.


సొమ్ము చెల్లింపులో అనుమానం ఉంటే ముందుగా నోటీసు ఇచ్చి వివరణ అడగాలని.. ఆ విషయమై చంద్రబాబుని అదుపులోకి తీసుకొని విచారించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అద్దె కింద 2019 జూన్ లో రూ.27 లక్షలు లింగమనేని పిటిషనర్ సతీమణి చెల్లించారు. ఆయన ఆ విషయాన్ని ఐటీ రిటర్నులో సమర్పించపోతే దాంతో పిటిషనర్‌కు సంబంధం ఏంటి అని. దీనికి లోకేశ్ , చంద్రబాబు లు ఇద్దరూ హెచ్ఆర్ఏ తీసుకున్నారు. కానీ భువనేశ్వరి 2019 జూన్‌లో డబ్బులు కట్టారు అన్నారు. అంటే అప్పుడు ఆమెను కూడా విచారించవల్సి ఉంటుంది. ఆ విధంగా నారా భువనేశ్వరి పేరును చంద్రబాబు తరఫు  న్యాయవాదులే తీసుకువచ్చారన్నది విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: