అసైన్డ్ భూములు ఉన్న వారికి బ్యాంకులు లోన్లు ఇవ్వవు. చివరకి వారి పేరు మీద పూర్తిగా పట్టా కూడా కాదు. ఎన్నో సంవత్సరాలుగా అసైన్డ్ భూములు ఉన్న వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది. దీనికి పరిష్కారం దిశగా జగన్ అడుగులు వేస్తున్నాడు. అసైన్డ్ భూములు 20 సంవత్సరాలు ఎవరి పేరు మీద ఉంటాయో వారి పేరు పై రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయం తీసుకుంది.


10 సంవత్సరాలు అసైన్డ్ ల్యాండ్ లో ఇళ్లు ఉన్న వారికి ఏ బ్యాంకు లోన్ ఇవ్వడం లేదు. కానీ ఆ బ్యాంకు లోన్ అనేది ఇవ్వకపోవడం వల్ల చాలా మంది పేదవారు కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు లోన్లు అనేవి కచ్చితంగా అవసరం ఉన్నా కూడా ఇవ్వని పరిస్థితిలో అసైన్డ్ భూముల్లో ఇళ్లు, భూములు ఉన్న వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు.


ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుని ఆ వడ్డీలు కట్టలేక తీవ్ర ఒత్తిడిలోకి వెళుతున్నారు. ఇలా వెళ్లడం వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన రోజులు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం చూపే దిశగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములు 20 ఏళ్లకు పైగా వారి పేరు మీద ఉంటే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఇండ్ల విషయంలో కూడా ఇదే అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు శాసనమండలిలో బిల్లును పాస్ చేసింది.


ఇది మొత్తం శాసన సభ, గవర్నర్ సంతకం పూర్తయి చట్టం అమల్లోకి వస్తే ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలవనుంది. దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో చాలా మంది నష్టపోతున్నారు. దీని వల్ల కొన్ని లక్షల మందికి ఉపయోగపడనుంది. వారికి కూడా అసైన్డ్ భూముల ద్వారా ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: