ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రస్తుతం ఖతర్, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇటు పాలస్తీనా, అటు ఇజ్రాయిల్ బందీలు విడుదలవుతున్నారు. కానీ ఇన్ని రోజులుగా ఇజ్రాయిల్ ను రెచ్చగొట్టిన ఇరాన్ మాత్రం తన మొండి వైఖరిని అలాగే ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయిల్ కు సంబంధించి అమెరికా హస్తం ఉందని పాలస్తీనా లో చిన్న పిల్లల మరణాలకు కారణం అమెరికానే అని దాన్ని అంతా ఈజీగా విడిచిపెట్టమని చెబుతుంది.


అయితే ఇజ్రాయిల్ ను కూడా బెదిరించింది. పాలస్తీనా పై దాడులు చేస్తే తీవ్ర పరిణమాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది. అయితే అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదుల దాడుల అనంతరం ఇజ్రాయిల్ ముందుగా గాజాలో వైమానిక దాడులు చేపట్టింది. అనంతరం నేవీ దాడులను చేసింది. తర్వాత భూతల దాడులకు కూడా దిగింది. ఈ దాడులు జరిగే సమయంలో కూడా కావాలనే ఇరాన్ ఇజ్రాయిల్ ను రెచ్చగొట్టింది.


అయినా ఇజ్రాయిల్ ఎక్కడా తగ్గకుండా గాజాలో హమాస్ ఉగ్రవాదులను ఏరి వేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం కాల్పుల మోత వినిపించకున్నా.. శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 60 మందికి పైగా బందీలను విడిపించుకుంది. కానీ ఇజ్రాయిల్ పై అటు లెబనాన్ నుంచి హిబ్జుల్లా టెర్రరిస్టుల ముఠా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇటు గాజాలో అటు లెబనాన్, వెస్ట్ బ్యాంకుల్లో దాడులను ఇజ్రాయిల్ సైన్యం సమర్థంగా తిప్పి కొడుతుంది.


కానీ ఇంత జరుగుతున్న కూడా ఇరాన్ కావాలనే గాజాలో ఉన్న పౌరులను రెచ్చగొట్టేలా, అమెరికా మాతో పెట్టుకుంటే అంతు చూస్తామని బెదిరిస్తోంది. ఈ యుద్దం రావడానికి పరోక్ష కారణం కూడా ఇరాన్ అనే తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులకు ఎక్కువగా ఆయుధాలను సరఫరా చేసి ఇజ్రాయిల్ మీద యుద్ధానికి కారణమైంది ఇరాన్ అని ఇజ్రాయిల్ ఆరోపిస్తుంది. కానీ సరైన సమయం కోసం ఇజ్రాయిల్ వేచి చూస్తోంది. ఒక్క సారి ఇరాన్ మీద దాడులకు దిగితే మాత్రం పరిస్థితి వేరేలా తయారయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA