అసలే రేవంత్ రెడ్డి అంటే వైయస్ షర్మిల కి పడదు అని అంటారు. అసలు మొన్నటి వరకు అయితే తెలంగాణకి ముఖ్యమంత్రిగా జానా రెడ్డి వచ్చినా పర్వాలేదు, ఉత్తమ్ కుమార్ వచ్చినా పర్వాలేదు అనుకునేది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అవ్వడానికి వీల్లేదు అన్నట్లుగా భావించేది షర్మిల. అయితే తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చేసరికి ఇప్పుడు షర్మిల ఆలోచన తల క్రిందులైంది.
తాను కాంగ్రెస్ లోకి వెళ్లకపోయినా తన పార్టీని విలీనం చేయకపోయినా కూడా కాంగ్రెస్ కి తన మద్దతు అయితే ఇవ్వడం జరిగింది. అయితే డీకే శివకుమార్ లాంటి వ్యక్తుల వల్ల తెలంగాణలో అసలు తన పార్టీ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా ముందుకు వెళ్లాలనుకున్న షర్మిల ఆశ కి రేవంత్ రెడ్డి బ్రేకులు వేసినట్టు అయిపోయింది. అలాగని మొన్నటి వరకు షర్మిలని ఆదరించిన కాంగ్రెస్ ఇకపై ఆదరించాలని అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రమేయం వల్ల వాళ్లు కూడా ముందుకు వెళ్లలేరు.
రేవంత్ రెడ్డి తెలంగాణలో యాక్టివ్ గా ఉన్నంతకాలం షర్మిలకి రాజకీయ భవిష్యత్తు లేదు. మరి ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం షర్మిలని ఆంధ్ర ప్రాంతానికి పంపించాలనుకున్న కూడా ఆ నిర్ణయం షర్మిలకు నచ్చదని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తన అన్న జగన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి తన అన్నకు వ్యతిరేకంగా, పోటీగా ఒకటే రాష్ట్రంలో నిలబడదు అని కొంతమంది అంటున్న మాట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి