స్వామి భక్తి గురించి అందిరకీ తెలిసే ఉంటుంది. ఓ వ్యక్తిని ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతూ.. ఆయన తప్పు చేసినా.. ఒప్పులాగే చూపిస్తూ.. కరెక్ట్ చేస్తే ఆకాశానికి ఎత్తుతూ ఎప్పుడూ ఆయన మెప్పు పొందాలని చూస్తుంటారు. ఈ పదం ఎల్లో మీడియాకి అద్భుతంగా సెట్ అవుతుంది. ఎందుకుంటే చంద్రబాబు కోసం పరితపించి మరీ వార్తా కథనాలు రాస్తుంటారు.


తమ వ్యక్తి పూజతో చంద్రబాబు ఇమేజ్ ని పేపర్లలో, టీవీల్లో ఆకాశానికి ఎత్తుతుంటారు. ఎంత సేపు టీడీపీ అధినేతకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యర్థిలో లోపాలను భూతద్దం పెట్టి మరీ వెతుకుతుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా పతాక స్థాయి వార్తలు రాస్తుంటారు. తద్వారా వైసీపీపై విషం చిమ్మడం.. టీడీపీకి లబ్ధి చేకూర్చడం వీరి పని. దీని కోసం ఎంత వరకు అయినా వెళ్తారు అంటే అతిశయోక్తి కాదు.


కానీ ఎల్లో మీడియా చేసే అతి వల్ల చంద్రబాబుకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఓ సారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ పై రాయి దాడి జరిగిన తర్వాత ఎవరికీ అనుమానాలు లేవు. కానీ వీరి అతితో ఆయన దళిత వ్యక్తి అంటూ మద్దతుగా మాట్లాడేసరికి అతని గురించి విచారణ చేస్తే టీడీపీ సానుభూతి పరుడు అని తేలింది. ఇది చంద్రబాబు చేశారని ఎవరూ అనుకోరు. కాకపోతే నెగిటివ్ కోణంలో చూపించే క్రమంలో ఆయన అభాసుపాలు అవుతున్నారు.


ఇక తాజాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలకు జనాలు రావడం లేదని.. సీఎం మాట్లాడుతుండగా లేచి వెళ్లిపోతున్నారని వెనుక నుంచి ఫొటోలు తీసి ప్రచురితం చేసి రాక్షసానందం పొందుతుంటారు. ఇప్పుడు తాజాగా ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్ చేసి జగన్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి అని రాస్తున్నారు. అంటే జనం భారీగానే వచ్చినట్లు కదా. చంద్రబాబుకి ఈ సమస్య లేదంటే ఆయన సభలకు ప్రజలు రావడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: