విశాఖకు రాజధాని కళ వచ్చేస్తోంది. 2023 మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదిక గ్లోబల్ ఇన్వెస్టర్స్  సమ్మిట్ నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన లోగోను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.


ఈ సమ్మిట్‌తో రాష్ట్రంతోపాటు పారిశ్రామికవేత్తలు లాభపడేలా ప్రభుత్వ విధానాలు మెరుగుపరుస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించి, మన రాష్ట్రంలో ఉన్న వనరులను తెలియజేసి, పెట్టుబడులు తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 నిర్వహిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అంటున్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. యువతకు ఉద్యోగాలు లభిస్తాయని  మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.


ఈస్ట్‌ కోస్ట్‌లో మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి, ఎక్స్‌పోర్ట్స్‌కు గేట్‌ వేగా ఉండాలని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.ఎలక్ట్రిక్‌ వెహికిల్, ఎడ్యుకేషన్, స్కిల్‌ డెవలప్‌మెంట్, టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఇన్నోవేషన్, స్టార్టప్స్‌పై ప్రధానంగా తాము దృష్టి సారించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎంఎస్‌ఎంఈలను బాగా పటిష్టం చేయాలనేది ముఖ్యమంత్రి ప్రధాన ఆలోచన అంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. మరిన్ని ఎంఎస్‌ఎంఈలను తీసుకురావాలని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తున్నారని వివరించారు. రెన్యూవబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు సంబంధించిన సెక్టార్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. మొత్తానికి విశాఖకు రాజధాని కళ వచ్చేస్తోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: