ఇటీవల రాజధాని అమరావతికి మద్దతుగా మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కొన్ని కామెంట్లు చేశారు. జగన్ కాబినెట్‌లో కమ్మ మంత్రులు లేకపోవడంపైనా ఆయన విమర్శలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదంటున్నారు ఆయన కుమారుడు, వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ .


ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును తన తండ్రి తప్పుబట్టడాన్ని తను సమర్ధించనని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రాజధాని విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయమే తనకు శిరోధార్యం అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు నోరు చాలా ప్రమాదకరమని.., ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజమని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు.


ముఖ్యమంత్రి జగన్‌ తోనే తన ప్రయాణం ఉంటుందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా పార్టీలో గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పోటీ చేయమంటే చేస్తా, లేకుంటే పార్టీ కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.


తాను అవకాశం ఇప్పించిన వారు కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. జోగి రమేష్, తనకు ఉన్న విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతే మీడియాతో మాట్లాడుతానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అనారోగ్యంతోనే ఇటీవల కాలంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివరణ ఇచ్చారు. మైలవరంలో అభ్యర్థిని మారిస్తే ఆ అభ్యర్థికి మద్దతుగా తాను నియోజకవర్గం లో తిరుగుతానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మొత్తానికి తండ్రి చేసిన కామెంట్లు తన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది రాకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జాగ్రత్త పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: