టీడీపీ నేత నారా లోకేశ్‌ తాజాగా సీఎం జగన్‌ను ఓ కోరిక కోరారు. పోలీసు ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు సడలించాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  డిమాండ్  చేస్తున్నారు. పోలీస్ నియామక బోర్డు ఛైర్ పర్సన్ కు నారా లోకేశ్లేఖ కూడా రాశారు. ఏటా పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన వైకాపా సర్కారు... మూడున్నరేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసిందని నారా లోకేశ్ ఆ లేఖలో తెలిపారు. వయోపరిమితి నిబంధన వల్ల... చాలామంది నిరుద్యోగులు అనర్హులుగా మిగిలిపోతున్నారని లోకేశ్ అంటున్నారు. పోలీసు ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి కనీసం ఐదేళ్లు సడలించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.


మరి నారా లోకేశ్‌ కోరిన ఈ కోరికను సీఎం జగన్ తీరుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలించాలన్న డిమాండ్‌ ఇప్పటికే నిరుద్యోగుల నుంచి ఉంది. గతంలో ఐదేళ్ల క్రితం ఏపీలో పోలీస్ నియామకాలు జరిగాయి. ఆ తర్వాత నియామకాలు జరగలేదు. అందుకే ఈ డిమాండ్ వస్తోంది. అయితే.. తాజాగా  వైసీపీ  సర్కారు  పోలీస్ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలు చాలా మందికి నిరాశ కలిగించాయి.


ఈ నిబంధనతో చాలా మందికి పోలీసు ఉద్యోగం అందని ద్రాక్షలా మారింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో పోలీసు ఉద్యోగాల భర్తీకి చివరి నోటిఫికేషన్ విడుదలైందని నారా లోకేశ్  గుర్తు చేశారు. ఏటా పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు, మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని నారా లోకేశ్  గుర్తు చేశారు.


నాలుగేళ్ల విరామం తర్వాత పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడడంతో ఉద్యోగార్థులు సంతోషపడ్డారు. కానీ గరిష్ట వయో పరిమితి నిబంధనతో ఆవిరైంది. యువత ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నారు. వారికి ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోంది. వయోపరిమితి నిబంధన వలన ఎంతోమంది అనర్హులుగా మారిపోయారు. మరి నారా లోకేశ్‌ కోరిక సీఎం జగన్ తీరుస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: