ఇటీవల సొంత పార్టీ పాలనపై విమర్శలు గుప్పించిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న సీఎం జగన్ను కలిశారు. సీఎం వైఎస్ జగన్ తో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకర్గంలో గడప గడప కార్యక్రమంలో నేను  వెనుకబడిన మాట వాస్తవమేనన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. 141 రోజులు గడప గడపకు కార్యక్రమంలో తిరిగానని.. తాను అస్వస్తతకు గురి కావడం వల్ల గడప గడప కార్యక్రమం చేశానన్నారు. ఏడాది పాటు ఎక్కువ శ్రమ తీసుకోవద్దని నాకు వైద్యులు సూచించారని.. గడప గడపకు బదులుగా పలు కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉన్నానని వివరించారు.

 
సీఎం ఆదేశంతో వైద్యుల సూచనతో ఇకపై గడప గడప కార్యక్రమం చేస్తానని.. పొట్టె పాలెం బ్రిడ్జి , దర్గా ,మసీదు సహా పెండింగ్ సమస్యలు సీఎం దృష్టికి తెచ్చి పరుష్కరించాలని కోరానని.. ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరించాలని ధనుంజయరెడ్డి కి సీఎం ఆదేశించారని.. నియోజక వర్గ అభివృద్ది కోసం మరింత శ్రద్ద తో పనిచేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వంపై ఎక్కడా విమర్శలు చేయలేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అధికారుల నుంచి సహాయనిరాకరణ జరుగుతోందని గతంలో చెప్పా ఇదే విషయాన్ని  సీఎంకు చెప్పానన్నారు.

 
అంతర్గత సమస్యలు ఉన్నాయి వాటిని సీఎంకు చెప్పానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సీఎంతో చర్చించిన అంతర్గత సమస్యలను మీడియాకు వెల్లడించనన్నారు. రూరల్ నియోజకవర్గంలో అనేక రోడ్లు ద్వంసమయ్యాయని...  ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే  నా ఆరాటం, నా పోరాటం అంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అధికారుల నుంచి నాకు సహకారం లేదు..ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు.

 
నా వ్యాఖ్యల్ని రాజకీయ కోణంలో చూస్తేతే ప్రజలకు నష్టం జరుగుతుందన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నా వ్యాఖ్యల్ని మానవీయ కోణంలో చూడాలని కోరుతున్నానన్నారు. నా నియోజకవర్గంలో 2700 మంది పెన్షన్లు తీసేందుకు నోటీసులు ఇచ్చారని..  వెరిఫై చేసి1700 మందికి తిరిగి పెన్షన్లు ఇచ్చారని.. అదనంగా కొత్తగా 1200 మంది పెన్షన్లు ఇచ్చారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: