పాలనానుభవంలో జగన్ కంటే చంద్రబాబే మిన్న అని నిరూపించుకున్నారు. నూతన రాజధాని కోసం అమరావతిలో 55వేల ఎకరాలను తీసుకోవాలనుకున్నారు. దాన్ని తీసేసుకున్నారు. కానీ నూతన రాజధానిగా విశాఖను ప్రకటించాలనుకుంటున్నా సీఎం జగన్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. కొత్త రాజధాని కోసం భూ సేకరణ చేయాలనుకుంటే రచ్చ రచ్చ అవుతోంది.


శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం.. టీడీపీ రాజధాని నిర్ణయం సరిగా తీసుకోలేదని వైసీపీ గనక జీవో లో ప్రకటించి ఉంటే సుప్రీం కోర్టు మెట్లెక్కిన ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. కానీ వైసీపీకి జగన్ కు ఎవరూ సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ ఇందులో విఫలమయ్యారు. కోర్టులో కేసులు, హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురు కావడం, వారు సుప్రీం కోర్టుకు వెళ్లడం, దాదాపు 250 మందికి పైగా నోటీసులు ఇవ్వడం జరిగింది.


హైకోర్టు తీర్పు చెల్లదని ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. చివర్లో వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసు ప్రకారం నడుచుకోవాలని దీన్ని మేం అంగీకరిస్తామని మిగతా వాటికి కాదని వైసీపీ వారు సుప్రీం కోర్టులు ఒకరిద్దరితో కేసులు వేశారు. అసలైతే శివరామకృష్టన్ కమిటీలో ఏముందో చూస్తే.. కమిటీలో ఉన్న విషయాలు ఇవీ.. ఏపీకి సూపర్ రాజధాని వద్దు. ప్రభుత్వ విభాగాలన్ని ఒకే చోట కేంద్రీకరించవద్దు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర విద్య సంస్థలు ఒకే చోట పెట్టొద్దని కమిటీ చెప్పింది.


విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు వస్తాయని.. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రాజధానులు మధ్యలో లేవు. కృష్ణా, గుంటూరు ఏరియాలో రాజధాని అయితే వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పింది. ఇన్ని అంశాలు ఉన్నా టీడీపీ మాత్రం శివరామకృష్ణ కమిటీ ప్రకారమే రాజధాని ప్రకటించామని చెబుతోంది. కాదు అవన్నీ తప్పు ఆ కమిటీ ప్రకారమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని వైసీపీ వాదిస్తోంది. చూడాలి ఎవరి మాట నిజమవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: