జగన్మోహన్ రెడ్డి అంటే తమకు ఎంతటి ధ్వేషభావం ఉందో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బయటపెట్టేసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లో చిక్కుకోపోయిన మత్స్యకారులను ఏపికి రప్పించటంలో జగన్ చాలా కష్టపడాల్సొచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్ ప్రాంతంలో ఉత్తరాంధ్రకు చెందిన సుమారు 3800 మంది చిక్కుకుపోయారు. తమను తమ సొంత ప్రాంతమైన ఉత్తరాంధ్రకు చేర్చటానికి ప్రయత్నాలు చేయమని వాళ్ళంతా అటు గుజరాత్ ఇటు ఏపి ప్రభుత్వాలను ఎప్పటి నుండో రిక్వెస్టులు చేస్తున్నారు. ఇదే విషయమై జగన్ గుజరాత్ సిఎం విజయ్ రూపానితో మాట్లాడాడు.. అలాగే కేంద్ర హోంశాఖతో కూడా చర్చలు జరిపాడు.

 

ఇదే సమయంలో  చంద్రబాబునాయుడు, పవన్ కూడా గుజరాత్ సిఎంతో పాటు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. సీన్ కట్ చేస్తే గుజరాత్ నుండి 38 బస్సుల్లో 3800 మంది ఉత్తరాంధ్రకు మత్స్యకారులు వస్తున్నారంటే జగన్ కష్టమే ఎక్కువుందనటంలో సందేహం లేదు. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం తమ వల్లే మత్స్యకారులు ఉత్తరాంధ్రకు వస్తున్నారంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. పైగా ట్విట్టర్లో ఇదే విషయమై పవన్ మాట్టాడుతూ గుజరాత్ సిఎం, కేంద్రహోంశాఖ సహాయమంత్రికి ధన్యవాదాలు చెప్పాడే కానీ జగన్ పేరును ప్రస్తావించటానికి కూడా ఇష్టపడలేదు.

 

గుజరాత్ నుండి మత్య్సకారులను రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 3 కోట్లను చెల్లించింది. అదే పనిగా ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ అదే పనిగా గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంతో చర్చలు జరుపుతునే ఉన్నారు. లాక్ డౌన్ కాలంలో ఒకేసారి గుజరాత్ నుండి ఏపికి వేలాది మందిని తెప్పించటమంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ చంద్రబాబో లేకపోతే పవనో ఓసారి లేఖ రాసినంత మాత్రాన జరిగిపోతాయా ? కాస్త జ్ఞానం ఉన్న ఎవరైనా సరే ముందుగా జగన్ కు కృతజ్ఞతలు చెబుతారు.

 

ఎందుకంటే మత్స్యకారులు గుజరాత్ నుండి ఏపికి బయలుదేరటంలో జగన్ చేసిన కృషికి గుజరాత్ సిఎం,  బిజెపి ఎంపి జగన్ కు ట్విట్టర్లో  కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పారు. జగన్ చొరవ తీసుకోకపోతే మత్స్యకారులు ఏపికి చేరుకోవటం సాధ్యమయ్యేది కాదని వాళ్ళు ట్విట్టర్లో స్పష్టంగా చెప్పారంటే ఏమిటర్ధం ?  అంటే వాళ్ళు జగన్ కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పటాన్ని కూడా చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారు.

ఈ విషయం చంద్రబాబు, పవన్ ట్వీట్లలో స్పష్టంగా బయటపడిపోయింది. తమ వల్లే మత్స్యకారులు ఏపికి వస్తున్నారని డప్పు కొట్టుకోవటమే విచిత్రంగా ఉంది. ట్విట్టర్లో కనీసం జగన్ పేరును కూడా ప్రస్తావించటానికి పవన్ ఇష్టపడని విషయం స్పష్టమైపోయింది. ధ్వేషభావంతో రాజకీయాలు చేస్తున్న పవన్ తాను సమాజాన్ని మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నది అబద్ధమని తేలిపోయింది. చంద్రబాబుకు మద్దతుగా జగన్ ను వ్యతిరేకించేందుకు రాజకీయాల్లోకి వచ్చిన విషయం స్పష్టమైపోయింది. దీనికి నిదర్శనమే ట్విట్టర్లో పోస్టింగ్

 

మరింత సమాచారం తెలుసుకోండి: