ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు మీడియా అటెంన్షన్ ఎలా తీసుకోవాలో బాగా తెలుసు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజాస్వామ్యం, విలువలు, చట్టాలు, రాజ్యాంగం లాంటవన్నీ ప్రతిరోజు గుర్తుకు వచ్చేస్తుంటాయి. అదే అధికారంలో ఉంటే మాత్రం పై పదాలు వినాలంటేనే  ఎక్కడలేని చికాకు పడిపోతారు. తాజాగా రేణిగుంట విమానాశ్రయంలో జరిగిందిదే. పంచాయితి ఎన్నికల్లో అధికారపార్టీ ధౌర్జన్యాలు చేసిందని, బెదిరింపులకు పాల్పడిందని ఒకటే ఊదరగొడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాగే చేస్తోందనే ఆరోపణలతో చిత్తూరు, తిరుపతిలో నిరసన, ఆందోళన చేయటానికి తిరుపతికి చేరుకున్నారు. చిత్తూరు, తిరుపతిలో పెద్ద ఎత్తున ఆందోళన చేయటానికి అనుమతిని ఆదివారమే టీడీపీ నేతలు చిత్తూరు, తిరుపతి ఎస్పీలను అడిగారు.




అయితే మున్సిపల్ ఎన్నికలు జరుగతున్న కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు నిరసనలు, ధర్నాలు చేయకూడదని టీడీపీ వాళ్ళు రాసిన లెటర్లకు ఎస్పీలు  రిప్లై కూడా ఇచ్చారు. ఇంకేముంది చంద్రబాబుకు ప్రచారం కోసం మంచి మ్యాటర్ దొరికేసింది. తిరుపతిలో నిరసనకు బస్టాండ్-రైల్వే స్టేషన్ మధ్య ఉన్న గాంధి విగ్రహం దగ్గర ధర్నా చేస్తామని చెప్పారు. అలాగే చిత్తూరులో పట్టణంలోని గాంధీ సెంటర్ దగ్గర నిరసనలు తెలిపేందుకు అనుమతివ్వాలని లేఖలో టీడీపీ నేతలు కోరారు. అయితే పై రెండు పట్టణాల్లోను ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల అనుమతి కుదరదని ఇద్దరు ఎస్సీలూ స్పష్టంగా చెప్పారు. అయినా చంద్రబాబు వినకుండా హైదరాబాద్ నుండి తిరుపతికి చేరుకున్నారు.




అనుమతి నిరాకరించినా ఆందోళనలకు రేణుగంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. దాంతో తెచ్చు పెట్టుకున్న చంద్రబాబు వెంటనే డ్రామా స్టార్ట్ చేసేశారు.  ఎయిర్ పోర్టు లాంజ్ లోనే కూర్చునేశారు. పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడారు. 14 సీఎంగా పనిచేసినట్లు గుర్తుచేశారు. భోజనం చేయటానికి కూడా నిరాకరించారు. ప్రాధమిక హక్కులపై పోలీసులతో పెద్ద వాదనే పెట్టుకున్నారు. ప్రభుత్వం తనను ఎలా అడ్డుకుంటుందంటు మండిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పోలీసులు ఎన్నికల కమీషన్ చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా తనను పోలీసులు అడ్డుకుంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడటమే విచిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: