
అది సింగరేణి కాలనీ. అయితే అయింది ఇప్పుడేంటి అని అడగకండి. తిట్టకండి మన నేతలు ఎలా ఉంటారో చెప్పే ఉదాహరణ ఒకటి చూడండి. ఈ కాలనీని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దత్తత తీసుకున్నాడు కేటీఆర్. తానే దగ్గరుండి బాగు చేస్తానని ఎలక్షన్ లో స్పీచు ఇచ్చాడు. ఇస్తే ఇచ్చాడు. మరి! దీనిపై స్పందించాడా అంటే అదీ లేదు. విపక్షం మొన్నటి వేళ ప్రశ్నిస్తే గులాబీ దండు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దత్తత గ్రామాల ఊసు కానీ దత్తత కాలనీల ఊసుకానీ మన నేతలకు ఏ మేరకు గుర్తుండిపోతుందో అని చెప్పేందుకు ఇదొక తాజా ఉదాహరణ.
ఇంకా చెప్పాలంటే.....:
చిన్నారి చైత్ర కేసు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్నీ కదిపి కుదిపేసింది. మన పోలీసుల అజాగ్రత్త, నిర్లక్ష్యం, పట్టింపులేని ధోరణి కారణంగా జరిగే నేరం ఇవన్నీ వెలుఉగ చూశాయి. డ్రగ్స్ మత్తులో తూగే ఓ కాలనీ పై,అసాంఘిక శక్తులు నడిచే ఓ ప్రాంతంపై పోలీసులకు అస్సలు పట్టింపే లేదన్న విషయం ఒకటి చిన్నారి చైత్ర ఘటన తేల్చిపో యింది. అయినప్పటికీ మన వ్యవస్థలో గొప్ప మార్పులేవీ కోరుకోకండి. అవి ఎలానూ రావు కనుక మనం మన పనుల్లో మునిగి తేలడం మినహా చేయదగింది ఏమీ లేదు. ఇప్పుడిక నివాళించే సమయం కూడా అయిపోయింది. మన నేతలకు ఇప్పుడిక వాటి గురించి ఆలోచించే సమయం కూడా లేదు. కొత్త నోటు విడుదల ఎప్పుడు ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు అన్న దిగ్భ్రాంతికర ఆలోచనలు తప్ప వీరి బుర్రల్లో ఏమీ లేదు వీరిలో! ఇప్పుడేం చేద్దాం?