వాస్తవానికి గౌతమ్ సవాంగ్‌కు వచ్చే ఏడాది జూలై వరకూ పదవీ కాలం ఉంది. కానీ.. ఆయన ఇప్పటికే డీజీపీగా పని చేశారు.. డీజీపీ అంటే.. రాష్ట్ర పోలీసు శాఖలో బాస్ పోస్టు.. ఇక ఆ పోస్టు చేశాక.. ఇంకా చేయడానికి ఏమీ ఉండదు.. సాధారణంగా డీజీపీ అయిన అధికారులు ఆ పోస్టుతోనే రిటైర్ అవుతుండటం సహజం. ఎందుకంటే.. సర్వీసు దాదాపు పూర్తయి.. మరో ఏడాదో.. కొన్ని నెలలో ఉన్నప్పుడే సాధారణంగా ఈ డీజీపీ వంటి పోస్టులు వస్తుంటాయి.
కానీ.. గౌతం సవాంగ్ కు మాత్రం ఇంకా ఏడాదిపైగానే సర్వీసు ఉంది. మరి అప్పటి వరకూ సవాంగ్‌ను ఏ పోస్టులో వేస్తారన్నది ఇంకా తేలలేదు. డీజీపీగా పని చేసిన తర్వాత మళ్లీ పోలీసు డిపార్ట్ మెంట్‌లోనే ఏదో ఒక పోస్టు చేయాలంటే అధికారులకు ఎంతో చిన్నతనంగా ఉంటుంది. అందుకే జగన్ ఆయన కోసం మరో ఆఫర్ సిద్దం చేసినట్టు వార్తలు వచ్చాయి. అదే.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టు.. ఆ పోస్టు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అందుకే గౌతం సవాంగ్‌కు దాన్ని ఆఫర్ చేశారని వార్తలు వస్తున్నాయి.
ఏపీపీఎస్సీ పదవి రాజ్యాంగబద్దమైన పదవి.. ఆరేళ్లు పదవీకాలం ఉంటుంది. కేబినెట్ ర్యాంగింగ్ పోస్టు.. ఎలాగూ వచ్చే ఏడాది రిటైర్ అయ్యే గౌతం సవాంగ్ కు ఇది మంచి అవకాశమే అవుతుంది. అయితే.. గౌతం సవాంగ్‌ను మరీ అంతగా గెంటేస్తారా అంటూ తాము చేసిన ప్రచారం కారణంగానే జగన్ ఈ ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేశాడని చంద్రబాబు అంటున్నారు. సర్పంచులకు అవగాహన కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఇందులో ఏమైనా వాస్తవం ఉందంటారా..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి