రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ యుద్ధానికి ఎంత త్వరగా ముగింపు లభిస్తే అది ప్రపంచానికి అంత మేలు చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రపంచ దేశాలు ఏకం కావాలంటోంది ఐక్యరాజ్య సమితి. ఈ మేరకు ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రపంచ దేశాలకు  పిలుపునిచ్చారు. ప్రపంచానికి తీవ్రమైన హాని కలిగించే ఇలాంటి యుద్ధం అర్థం లేనిది, క్రూరమైనదని ఆయన అంటున్నారు.


ఈ యుద్ధంలో కనీసం ఒక్కరోజు  కాల్పులను ఆపినా.. డజన్ల కొద్దీ పౌరుల ప్రాణాలను కాపాడొచ్చని అంటున్నారు గుటెరరస్. యుద్ధం ఒక్క రోజు ఆపినా  వేల మంది రష్యా దాడుల నుంచి తప్పించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని గుటెరస్  అంటున్నారు. ఇటీవలి ఆయన రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తన రష్యా పర్యటన వివరాలు వెల్లడించిన గుటెరస్.. ఉక్రెయిన్‌పై సైనికచర్య ఆ దేశ  ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని రష్యాకు చెప్పినట్టు గుటెరస్ వివరించారు.


రష్యా చర్యలు ఐక్య రాజ్య సమితి చార్టర్‌ను ఉల్లంఘించటమేనని తాను రష్యాకు చెప్పినట్టు గుటెరస్ చెప్పారు. ఉక్రెయిన్‌, రష్యాతోపాటు ప్రపంచం కోసం తక్షణమే యుద్ధం ఆపాలని కోరినట్లు గుటేరస్‌ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో భేటీ సందర్భంగాఆహారం, విద్యుత్‌ సదుపాయాలు తక్షణం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తాను సూచించినట్టు గుటేరస్‌ చెప్పారు.


అయితే.. గుటెరస్‌ ఇన్ని చెబుతున్నా.. ఐక్య రాజ్య సమితి పాత్ర ఈ విషయంలో నామమాత్రంగానే ఉంది. గతంలో నానాజాతి సమితి విఫలం అయినట్టుగానే.. ఇప్పడు ఐక్య రాజ్య సమితి తీరు కూడా కనిపిస్తోంది. ఏ దేశమూ ఐక్య రాజ్య సమితిని లక్ష్య  పెడుతున్నట్టు లేదు. రష్యా తో సంప్రదింపులు జరిగి.. ఆ దేశం అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. ఆ దిశగా ఉక్రెయిన్‌తోనూ చర్చలు జరిపితే కొంత ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సహకరించడం అగ్నికి ఆజ్యం పోయడమే అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: