జగన్‌ సర్కారు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని ఆలోచిస్తోంది. వ్యవసాయ భూములపై ఎసైన్డ్‌దారులకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పించే విషయాన్ని జగన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎసైన్డ్‌ వ్యవసాయ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తే.. అటు వారికీ లబ్ది చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని చేకూరుతుందని భావిస్తున్నారు.


ఏపీలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ఇప్పటివరకు 35 లక్షల ఎకరాలను ఎసైన్‌ చేశారు. ఈ భూములకు డి.పట్టా పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ దాదాపు 20 నుంచి 40 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు.. అప్పట్లో ప్రభుత్వం అసైన్డ్ చేసిన ఈ భూములు పట్టణాలు, నగరాలు, గ్రామ పంచాయతీలకు దూరంగా ఎక్కడో ఉండేవి. కానీ మారిన కాలక్రమంలో.. ఇవి ఇప్పుడు గ్రామాలు, పట్టణాలకు దగ్గరయ్యాయి. పట్టణీకరణ పెరగడం వల్ల ఈ అసైన్డ్ భూములు ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో భాగంగా మారాయి.


అందువల్ల ఈ అసైన్డ్ భూములకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఏపీలో కొత్త జిల్లా కేంద్రాలకు సమీపంలోని భూములకు అసైన్డ్ భూములకు ఇంకా గిరాకీ పెరిగింది. అందువల్ల ఈ ఎసైన్డ్‌ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా చేస్తే రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ఇలాంటి భూములు లక్షల ఎకరాలు ఉండటం వల్ల వీటి రిజిస్ట్రేషన్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది.


వాస్తవానికి ఈ అసైన్డ్ భూములు చాలా వరకూ చేతులు మారుతూనే ఉన్నాయి. అయితే చట్ట ప్రకారం ఎసైన్డ్‌ భూములను విక్రయించినట్లు రుజువైతే ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు కూడా. అందువల్ల అసైన్డ్ భూములపై పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తే ఇక ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అయితే.. ఈ నిర్ణయంతో అసైన్డ్ భూములు ఉన్నవారి గణనీయంగా లబ్ది పొందుతారు. వారికి తమ భూములు అమ్ముకునే హక్కు వస్తుంది. అందుకే వారు సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇది ప్రభుత్వానికీ, అసైన్డ్ భూముల వారికీ ఇద్దరికీ మేలైన నిర్ణయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: