తెలంగాణ రాష్ట్రంలోని హాస్టళ్లు, ప్రభుత్వ గురుకులాల్లో సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అనేక చోట్ల ఇటీవల పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. నిధుల కేటాయింపు, పర్యవేక్షణ విషయంలో లోపాలతో పేదల పిల్లలు నానా అగచాట్లు పడుతున్నారు. తాజాగా కస్తూర్భా గురుకుల ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇందులో చదువుతున్న బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చనిపోతున్నారని ఆయా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.


పేద విద్యార్థులు అనారోగ్యానికి గురిఅవుతున్నారని ఆయా సంఘాల నాయకులు కమిషన్ ను దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో గత నెల రోజులుగా ఈ పాఠశాలలో లక్షల మంది పేద విద్యార్థులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. సరైన పోషక ఆహారం, సురక్షిత మంచినీరు, బట్టలు, చెప్పులు, కాస్మొటిక్ వస్తువులు వారికి ఇవ్వడం లేదు. కనీసం రోగమొస్తే వైద్యం, మందుబిళ్లలు, వైద్యులు, కనీసం సిస్టర్స్ కూడా అందుబాటులో లేరని వారు వివరించారు.


చాలా పాఠశాలలకు స్వంత భవనాలు లేవు. చిన్న చిన్న అద్దె భవనాలు, ఊరు చివర, అడవుల పక్కన గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో... పాములు, తేళ్లు ఇతర విషపురుగులు వచ్చి విద్యార్థులను కాటేస్తున్నాయి. విష పురుగుల కాట్లతో ఈ నెలలోనే ఇద్దరు విద్యార్థులు మరణించారు. గతంలోనూ ఇలా చాలామంది విద్యార్థులు చనిపోయరు.


రాజ్యాంగం ప్రకారం పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక విద్యను అందించడం ఒక హక్కు అంటున్న ఆయా సంఘాల నేతలు... ఈ హక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. విద్యార్థుల ప్రాధమిక హక్కులను కాపాడి... హక్కులను ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు తీసుకొని వారు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని ఆయా సంఘాల నేతలు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr