బిబిసి మరొక వివాదంలో చిక్కుకుంది. అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది.. బీబీసీ హెడ్ గా ఉన్న ఆయన, అంతకు ముందు ప్రధానిగా ఉన్నటువంటి బోరిన్ జాన్సన్ కు లంచం ఇచ్చి ఆ పదవిలోకి వచ్చాడనే దానిపై  విచారణలో నిజమే అని తేలింది. అయితే  అప్పు ఇప్పిచ్చాడు అన్నటువంటి లంచానికి సంబంధించి విచారణ జరుగుతుంది. వేరే కమిటీ అంతర్గతంగా  చూస్తుందని నెపంతో వదిలేశారు.


ఆయనను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అతని నాయకత్వంలో కొత్త సమస్య వచ్చి పడింది. కొంతమంది యాంకర్లు లైవ్ లైవ్ ఇవ్వడానికి తిరస్కరించడమే ఆ సమస్య. బ్రిటన్ బీబీసీ గ్యారీ లింకర్‌ పై వ్యవహరించిన తీరుపై కోపం పెరుగుతోంది, బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ తన స్పోర్ట్స్ కవరేజీని చాలా వరకు రద్దు చేయవలసి వచ్చింది, కారణం వారు గ్యారీ లింకర్‌కు మద్దతు ఇస్తున్నందున పని చేయడానికి ఇష్టపడకపోవడం లేదని తెలుస్తుంది. యూ.కే ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ పాలసీ బ్రిటన్‌లో వాక్ స్వాతంత్ర్యంపై  పెద్ద చర్చకు దారితీసింది.


బీబీసీకి సంబంధించినటువంటి ఉన్న ప్రజెంట్ ఎవరైతే ఫీల్డ్ లో ఉండి వీళ్ళ ఇంటర్వ్యూలు చేసే యాంకర్ కం ప్రజెంటెర్ గ్యారీ లింకర్ మొన్న రిషి సనక్ ప్రభుత్వాన్ని తప్పుపట్టాడు. అతను ప్రభుత్వ పాలసీ ఏదైతే విదేశీయులను చొరబాటుదారులుగా ఆ చొరబాటుదారులకు అవకాశం ఇవ్వం, రువాండాకు పంపించేస్తామని అన్నప్పుడు దాన్ని హిట్లర్  పద్ధతి అని విమర్శించిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు. దాంతో అతనికి లైవ్ ప్రసారాలు చాలా వరకు అంతకుముందు అగ్రిమెంట్ అయ్యి ఇచ్చినటువంటి వాటిని కూడా క్యాన్సిల్ చేసింది బీబీసీ.


బీబీసీ ఆ వర్క్ ని వేరే వాళ్ళకి అప్ప చెప్పింది. అయితే ఇప్పుడు వేరే యాంకర్లు, ప్రజంటర్లు కూడా బీబీసీ లో లైవ్ లో చేయడానికి నిరాకరించి చేయనంటున్నారు. ఎందుకంటే ఇతను ఇంతకుముందు సాకర్ కెప్టెన్ కూడా. అలాంటి వ్యక్తినే మీరు అవమానించారు, రేపు మమ్మల్ని అవమానించరని ఏంటి గ్యారెంటీ అని ఎదురు తిరుగుతున్నారు‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

BBC