
వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాల లిస్టును సచివాలయాల్లో పెడుతున్నారు. ఎస్ గొల్లపల్లి అనే గ్రామ సచివాలయం వద్ద వైసీపీ అందించిన పథకాల లిస్టును పెట్టారు. 2019 -20 వరకు అందిన పథకాలు లిస్టు ఇదే.. ఆసరా, అమ్మఒడి, చేదోడు, ఈబీసీ నేస్తం, ఇన్ ఫుట్ సబ్సిడీ ఫార్మర్, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, పాస్టర్స్ పెన్షన్స్, రైతు భరోసా, సున్నా వడ్డీ రుణ పథకం, సున్నా వడ్డీ వాహన మిత్ర, వైఎస్ ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత, లాంటి పథకాలు గ్రామంలో అందినట్లు లిస్టులో పేర్కొన్నారు.
ప్రతి ఒక్క పథకంలో ఎంతమందికి లబ్ధి చేకూరిందనే వివరాలు కూడా పూర్తి వివరాలతో లిస్టులో పొందుపరిచారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏయే రోడ్లు వేసుకొచ్చారు. నూతన పీహెచ్ సీ భవన నిర్మాణం, సీసీ రోడ్లు, అభివృద్ది పథకాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ఆయా డెవలప్ మెంట్ ఖర్చులకు ఎన్ని కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు పెట్టిందనేది పూర్తి వివరాలతో గ్రామ పంచాయతీ వద్ద లిస్టు ను పెట్టారు.
నీటి సదుపాయం కోసం డ్రిప్, బోరు ఇతర మౌలిక సౌకర్యాలను కూడా అక్కడ పొందుపరిచారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సచివాలయాల వద్ద ఇలాంటి బోర్డులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. మరి లిస్టు ద్వారా వైసీపీకి ఏమైనా ఉపయోగపడి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్యానుకు ఓటేస్తారో లేదో చూడాలి.