చైనా కమ్యూనిస్టు దేశం. అమెరికాలోని మెక్సికో కు సంబంధించిన డ్రగ్స్ అమ్మేవాళ్లు.. చైనా నుంచి నడిపిస్తున్నట్లు బయట పడింది. అవి చైనా సంస్థల ద్వారా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయంటే.. మెక్సికో కు చెందిన డ్రగ్స్ మాఫియా వాళ్లు చైనా బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేశారు. ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు మొత్తం చైనా బ్యాంకుల నుంచి జరుగుతున్నాయి.


కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు డ్రగ్స్ మాఫియా ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఈ డబ్బంతా డ్రగ్ మాఫియాదని తెలిసి కూడా చైనా అంగీకరిస్తోంది. అయితే ఏదైనా సంస్థ బ్యాంకు అకౌంట్ తీసే సమయంలో దాని పని వివరాలు, సంస్థ గురించి డిటైల్స్ ఇస్తుంది. కానీ అవేవీ తెలుసుకోకుండా చైనా ఇలా చేస్తుందా అని  విమర్శలు వస్తున్నాయి.


ఒక వేళ ఆయా సంస్థలకు సంబంధించి ఖాతాల్లో డబ్బుల విషయంలో తేడాలు కనిపిస్తే అప్పుడు బ్యాంకులు ప్రభుత్వానికి తెలియజేయాలి. అయితే చైనా బ్యాంకులు ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాలి. కానీ ఈ డ్రగ్ మాఫియాతో చైనా ప్రభుత్వానికే సంబంధం ఉన్నట్లు తేటతెల్లం అయింది. చైనా ప్రభుత్వమే ఆ డబ్బులను అంగీకరించాల్సిందిగా బ్యాంకులకు చెప్పినట్లు సమాచారం. దీని వల్ల చైనా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగినట్లు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి.


దాదాపు ఈ డ్రగ్స్ కు అలవాటై 1700 మందికి పైగా చనిపోయినట్ల తెలుస్తోంది. అక్కడ 1.54 బిలియన్ డాలర్ల డ్రగ్ వ్యాపారం జరుగుతోందని అమెరికా ఆరోపిస్తోంది. మనుషుల ప్రాణాలతో చైనా చెలగాటమాడుతోందని తీవ్రంగా విమర్శలు చేసింది. మెక్సికో చైనా రెండు కలిసి ఇలాంటి పనులు చేసినట్లు తెలుస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. డ్రగ్స్ ను అరికట్టాల్సిన చైనా ఏకంగా దానిపైనే  వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా డబ్బు సంపాదిస్తూ మనుషుల ప్రాణాలను తీస్తోందని అమెరికా నిఘా వర్గాలు విషయాన్ని బహిర్గతం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: