గతంలో ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశంగా భావించేవారు వాళ్లకి సరిగా అవగాహన లేక. మన వేద గ్రంధాల్లో వివరించిన విజ్ఞానాన్ని, సాంకేతికతను వీటన్నిటిని దొంగిలించి అవేవో వాళ్ళ సొంత పరిజ్ఞానంగా పేర్కొంటూ భారత్ ను తక్కువగా చూసేవారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి భారత్ విలువ తెలిసి లోలోపల భయపడేవారు. ఎందుకంటే భారత్ తన విజ్ఞానాన్ని, సాంకేతికతను సరిగ్గా వినియోగిస్తే ప్రపంచ దేశాలన్నిటికీ ఒక గురువులా మారిపోతుందని ఈ అగ్ర రాజ్యాలకి ముందే తెలుసన్న వాదన ఉంది.


అయితే ఇప్పుడు అగ్రరాజ్యాలని చెప్పుకుంటున్న దేశాలు వాళ్లలో వాళ్లు యుద్ధాలు చేసుకుని తమ శక్తిని, సాంకేతికతను, విజ్ఞానాన్ని దుర్వినియోగం  చేసుకుంటున్నారు. భారత్ మాత్రం తన వేద విజ్ఞానాన్ని, సాంకేతికతను తెలుసుకొని సరిగ్గా వినియోగించుకుంటుందన్న వాదన ఉంది. పక్క దేశాలతో అవసరమైతేనే తప్ప కలహానికి కాలు దువ్వడం లేదు మిగిలిన దేశాలు లాగా. మోడీ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గౌరవిస్తున్నాయని, ఒక విలువైన దేశంగా పరిగణిస్తున్నాయని తెలుస్తుంది.


అందుకే భారత్ తమకు గురువు స్థానంలో ఉండి ముందుకు నడిపించమని అడుగుతున్నాయట పసిఫిక్ దేశాలు. వాటిలో పంబ న్యూగినికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రసంగించడం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పంబ న్యూగిని ప్రైమ్ మినిస్టర్ జేమ్స్ మరేపే మాకు నాయకత్వం వహించి పెట్టండి అని మోడీని అడుగుతున్నారట. ఆయన ఏమంటున్నారంటే ప్రపంచంలో అందరూ మమ్మల్ని కావాలని కోరుకుంటారు.


కానీ మాకు పెట్రోలు, డీజిల్ ఇవన్నీ అధిక రేటుకు ఇస్తుండటంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరు మాకు సహకరించండి అని అడుగుతున్నారట. మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేసియా, పంబ న్యూ గిని, నౌరూ, పలావు, సాల్మన్ ఐలాండ్స్, తువాల్ , కిర్బోవా, సమోవా, నియూ, కుక్ ఐలాండ్స్, టోంగా, ఫిజీ, ఇలాంటి దేశాలన్నీ ఇప్పుడు మోడీ తమకు మార్గ నిర్దేశకత్వం చేయాలని అడుగుతున్నాయట. మరి మోడీ దీనిపై ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: