కోడెల శివప్రసాద్ రెడ్డి మొదట నుండి తెలుగుదేశం పార్టీ కి అభిమాని. ఇంకా తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడు. ఆయన తెలుగుదేశాన్ని విడిచి ఎప్పుడు కూడా కాంగ్రెస్లోకి గాని, బిజెపిలోకి గాని  మారలేదని తెలుస్తుంది. గతంలో ఎన్టీఆర్ తోను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోను అలాగే కొనసాగారట. తెలుగుదేశం పార్టీకి విశ్వాస పాత్రుడిగా కొనసాగుతూనే వచ్చారాయన.


చంద్రబాబు నాయుడు కి సపోర్ట్ చేసిన వాళ్ళలో కోడెల శివప్రసాద్ రెడ్డి మొదటి వర్గానికి చెందిన వారై ఉంటారు. అయితే ఆయన నరసరావుపేట ప్రజలకు దూరమై సత్తెనపల్లి ప్రజలకు దగ్గరయ్యారట. సత్తెనపల్లిలోనే ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆయన ఆ తర్వాత తన విశ్వాస పాత్రతకి మంత్రి పదవి వస్తుందని ఆశించారట. కానీ ఆయన స్పీకర్ పదవితో సర్ది పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది.


ఆ తర్వాత ఆయన దిగిపోయాక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే ఆయన మరణాన్ని కూడా పక్క త్రోవ పట్టించడానికి లేదా సైలెంట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే దీని వెనకాల జగన్ వేధింపులు ఇంకా వైఎస్ఆర్సిపి నాయకుల హెరేస్మెంట్ అవి ఉన్నాయంటూ సానుభూతి చూపించుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే అదే సానుభూతితో ఆ స్థానాన్ని, కోడెల శివ ప్రసాద్ రెడ్డి స్థానాన్ని ఆయన కొడుకు కోడెల శివరాంకి ఇస్తారని అందరూ అనుకున్నారు.


కానీ చంద్రబాబు నాయుడు కన్నా లక్ష్మీనారాయణకి ఆ సీటును ఇచ్చారని తెలుస్తుంది. అయితే కోడెల శివరాం దీనిపై స్పందిస్తూ నేను దీనిపై ఊరుకునేది లేదని రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని ఆయన చెప్పాడట. అయితే ఎందుకు కోడెల శివరాంకు ఆ సీటు ఇవ్వలేదంటే ఆ స్థానంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉండటం ఒక కారణమని తెలుస్తుంది. ఇంకా కాపు కమ్మ సామాజిక వర్గం మధ్య స్నేహ బంధాన్ని చూపించుకోవాలంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రోత్సహించాలని ఆ విధంగా చేసినట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: