అయితే ఆ తర్వాత 2019-20 మధ్యలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన భారతీయ జనతా పార్టీ ఇద్దరూ చెరో సగంగా పోటీ చేశారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ 105 సీట్లు గెలుచుకుంటే, 56స్థానాలు శివసేన పార్టీ గెలుచుకుంది అప్పుడు. అయినా కూడా తనకే ముఖ్యమంత్రి కావాలని అడిగింది శివసేన. దానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించలేదు.
దానితో శివ సేన భారతీయ జనతా పార్టీ కూటమి నుండి బయటకు వచ్చి, కాంగ్రెస్ ఎన్సిపి కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చడమే కాకుండా షిండే ద్వారా శివసేనను చీల్చింది భారతీయ జనతా పార్టీ. శరత్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవర్ ఈ మధ్యనే ఆ పార్టీని చీల్చుకుంటూ వచ్చాడట. ప్రస్తుతానికి మెజార్టీ స్థిరంగానే ఉన్నా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్తున్న నిజం.
రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్ కి వచ్చేసరికి 45 శాతం ఓట్లతో 28 సీట్లు ఐ ఎన్ డి ఐ ఏ కూటమి అంటే శివసేన ఉధ్ధవ్ దాకరే వర్గం, ఎన్సీపీ వర్గం శరత్ పవర్ వర్గం అటు కాంగ్రెస్ కూడా కలిసి వస్తాయని, 40శాతం ఓట్లతో 20శాతం సీట్లు ఎన్ డి ఏకి వస్తాయని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి