ఇది చాలా వరకు బీజేపీని దెబ్బతీసింది. 70 రూపాయల వరకు ఉన్న పెట్రోల్, డిజీల్ రేట్లు అమాంతం పెరిగిపోవడంతో కర్ణాటక, ఛత్తీస్ గఢ్, హిమచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది.అయినా కూడా పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించలేదు. గతంలో ఇన్ కం ట్యాక్స్, ధరలు తగ్గించడంతోనే 2019 లో కూడా బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైంది.
అయితే గ్యాస్ ధరలను కూడా పెంచేయడం వల్ల సామాన్య ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రూ. 500 ఉన్న గ్యాస్ సిలిండర్ 1100 వరకు పెరిగింది. ఇప్పుడు మాత్రం కేంద్రం రాఖీ పండగ సందర్భంగా దేశ ప్రజలకు కానుకగా రూ. 200 గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దాదాపు రూ. 700 వరకు పెంచిన సిలిండర్ ధరల్ని కేవలం రూ. 200 వరకే పెంచడం ఎంతవరకు సబబు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాబోయే రెండు మూడు నెలల్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తదితర రాష్ట్రాల్లో ఎన్నికలను బేస్ చేసుకుని గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించారని చెబుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రజలు ఆయా రాష్ట్రాల్లో బీజేపీని విశ్వసిస్తారా? గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడంపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో ఎన్నికల్లో తేలిపోనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి