ఒకప్పుడు ఆంధ్రాని చూసి తెలంగాణ నేర్చుకోవాలి అనేవారు. ఏపీ ప్రజలంతా చాలా తెలివిగా వ్యవహరిచేవారు. విభజన సమయంలో హైదరాబాద్ లో ఆంధ్రులు అవమానించబడ్డారు అనే వాదన ఉంది. కిరాణా దుకాణాల దగ్గర నుంచి కంపెనీల వరకు ఒక విబేధం ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.  అందరూ సవ్యంగా కలిసి మెలిసి ఉంటున్నారు. ప్రాంతీయ బేధాలు లేకుండా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలని చూసి ఆంధ్రా ప్రజలు నేర్వాల్సింది చాలా ఉంది.


అదేంటంటే ఆంధ్రాలో దాడులు పెరిగాయి.  నాయకులకు సంబంధించిన వ్యవహారాలు వాళ్లు చూసుకోవాలి. రాజకీయ వ్యవహారాలు నేతలు చూసుకోవాలి. అయితే వారికి మనం ఏ వేదిక ద్వారా అయినా సంఘీభావం ప్రకటించవచ్చు. కానీ ఏపీ ప్రజలు భౌతిక దాడులు, దుర్భాషలకు దిగుతున్నారు. కులతత్వం పెరిగిపోతోంది.  యువతను రాజకీయ పార్టీలు పక్కదోవ పట్టిస్తున్నాయి.  రోడ్డెక్కుతున్న యువతకు నియంత్రణ లేకుండా పోతోంది. ఇక్కడ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు పదో వంతు కూడా తెలంగాణలో లేవు.


తెలంగాణలో కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విబేధాలు నడుస్తున్నాయి. కానీ ఇక్కడి యువత ఈ తరహా దాడులకు పాల్పడటం లేదు. ఇది ఏపీకి ఒక ప్రమాదకర సంకేతం. దీనిని నియంత్రించుకోవాలి. లేకుంటే భవిష్యత్తు తరాలు నష్టపోయే ప్రమాదముంది. రాజకీయ కక్ష సాధింపులు రెండు చోట్లా ఉన్నాయి.


ఈ కక్ష సాధింపులకి మధ్య అక్కడా ఇక్కడా తేడా మీడియానే. తెలంగాణలో మీడియా బాధ్యతాయుతంగా ఉందని.. ఏపీకి వచ్చేసరికి విశృంఖులంగా ఉందనే వాదన ఉంది. కారణం టీఎస్ లో కేసీఆర్  అంటే భయం. ఏపీలో జగన్ అంటే బరితెగింపు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న మీడియాకు తెలంగాణ ప్రజలు చెక్ పెడుతున్నారు. ఏపీలో వివాదస్పద వ్యాఖ్యలకు, దాడులకు  ఘనంగా స్వాగత నీరాజనాలు పలుకుతున్నారనే వాదన ఉంది. ఇది గుర్తించి నియంత్రించకపోతే ఏపీ యువత నష్టపోయే ప్రమాదముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: