తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు కాళ్లకు బలపం కట్టుకొని మరీ నియోజకవర్గాలను చుట్టేశారు. దాదాపు పార్టీ అగ్రనేతలంతా తెలంగాణ ప్రచారంలో పాల్గొన్నారు.  అయితే కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు చిరునామా. ఒకరంటే మరొకరకి పొసగదు. అలాంటి కాంగ్రెస్ నేతల్లో ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఉన్నట్టుండి మార్పు వచ్చేసింది.


ఎంపీలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి సీనియర్ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ప్రకటనకు ముందు రేవంత్ రెడ్డిపై ఒంటి కాలిపై లేచే నేతలు.. ప్రస్తుతం పల్లెత్తి మాట కూడా అనడం లేదు. మరోవైపు సీనియర్ నేతలు వారి నియోజకవర్గాలు దాటి బయటకు రావడం లేదు. గ్రూపు రాజకీయాలు కూడా చేయనట్లు కనిపిస్తోంది. సడన్ గా ఎందుకీ మార్పు. సీనియర్లందర్నీ రేవంత్ ఎలా మేనేజ్ చేశారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోను తలెత్తుతోంది.


దీనికి రేవంత్ రెడ్డి బదులిస్తూ ఒక పరేడ్ గ్రౌండ్ తీసుకుంటే అందులో రకరకాల ఆటలు ఆడేవారు ఉంటారు.  అలాగే కాంగ్రెస్ లో కూడా అన్నిరకాల ఆలోచనలు కలిగిన వారు ఉంటారు.  ఫైనల్ గా అధిష్ఠానం చెప్పింది కలసికట్టుగా చేస్తాం.  ప్రస్తుతం అందరం ఒక జట్టుగా మారి తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొంటున్నాం అని వివరించారు.


గత పదేళ్లలో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక లో ఎవరూ కూడా సీఎంని మార్చలేదు. ఆ సంప్రదాయానికి కాంగ్రెస్ స్వస్తి పలకింది. ఇప్పుడు దానిని బీజేపీ అలవర్చుకొంది. ఇప్పుడు ఇలాంటి సమస్యతో మేం బాధ పడటం లేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులంతా కలసికట్టుగా పనిచేయడం ఆ పార్టీకి అతిపెద్ద సానుకూలాంశంగా మారింది. చూద్దాం ప్రజలు దీనిని ఏ విధంగా తీసుకుంటారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: