ఆర్మూర్ కొద్ది రోజులుగా ఈ పేరు తెగ చర్చలో ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవహారంలో బయట పడుతున్న విషయాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇవి ఆయన్ను షాక్ కు గురి చేస్తున్నాయి. ఆరట్ఈసీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే మూసేస్తామని అధికారులు హెచ్చరించిన రోజుల వ్యవధిలోనే తమ దగ్గర తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు మొత్తం కలిపి రూ.45 కోట్లు చెల్లించాలని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ నుంచి రూ.20 కోట్ల రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డిపై ఈ లోన్ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. అప్పు సంగతి పక్కన పెడితే వడ్డీ కూడా కట్టలేదు.
తెలంగాణ రాజకీయాల్లో దౌర్జన్య పూరితంగా వ్యవహరించిన నేతల్లో ఒకరుగా జీవన్ రెడ్డి నిలుస్తారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో డబ్బులు అడిగే సాహసం అధికారులెవరూ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికారులకు ధైర్యం వచ్చింది. దీంతో వరుస పెట్టి నోటీసులు అందజేస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండటంతో ఏమీ కాదనే ధీమాలో ఉన్న జీవన్ రెడ్డి తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని అక్రమాలు బయట పడతాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి