చంద్రబాబు నాయుడు తాజాగా తమ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేశారు. సహజంగానే పొత్తు ధర్మం, సీటు దక్కలేదనే అసంతృప్తితో పార్టీ లో అసమ్మతి భగ్గుమనడం సహజం. కానీ టీడీపీ అయితే ఒకలా.. ప్రత్యర్థి పార్టీ అయితే మరోలా రాయడం ఒక్క ఎల్లో మీడియాకే చెల్లుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇందులో జనసేనను కూడా ఆ మీడియా మినహాయించడం లేదు.


టీడీపీలో అసంతృప్తులకు బుజ్జగిస్తున్నారని చంద్రబాబు గురించి గొప్పగా రాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు గౌరవ ప్రదమైన స్థానం కల్పిస్తాం. ఈ ఒక్కసారికి సహకరించండి. పార్టీ నిర్ణయాన్ని గౌరవించండి అంటూ అసంతృప్తులకు చంద్రబాబు బుజ్జగింపులు అంటూ వార్తను రాశారు. దీనిని మమ అనిపించారు. అదే జనసేన విషయానికొచ్చే సరికి.. ఆ పార్టీలో అసమ్మతి స్వరాలు అంటూ పెద్ద ఎత్తున రాసుకొచ్చారు.


పొత్తుల సీట్లను కోల్పోయిన నేతలను బుజ్జగించేందుకు జనసేన పార్టీ కార్యాలయం రంగంలోకి దిగింది. అసంతృప్తితో ఉన్న నాయకులతో సీనియర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసరావు పేరు ప్రకటించగానే స్థానిక నాయకులు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా తిరుపతిలో హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందిస్తున్నారని అభ్యర్థికి మద్దతివ్వాలని పార్టీ సూచించింది. దీంతో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ ఆరణితో కలిసి పూజలు చేశారు.


భీమవరంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. పవన్ అక్కడ పోటీ చేయాలని స్థానిక నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ ఆయన టీడీపీ నుంచి వచ్చిన రాపర్తి రామాంజనేయులుని అభ్యర్థిగా ప్రకటించారు. దీనిని వారు వ్యతిరేకించారు. పవన్ నేరుగా రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో వారు శాంతించారు. విజయవాడ పశ్చిమలో జనసేన నేత పోతిన మహేశ్ కు ఇస్తానని పవన్ గతంలో ప్రకటించారు. కానీ ఆసీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. దీంతో మహేశ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధర్మవరం సీటును చిలకం మధు ఆశిస్తున్నారు. వీటితో పాటు పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమంది. పవన్ రంగంలోకి దిగి సర్ది చెప్పాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: