ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ, ఏపీలుగా విభజించారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అన్ని ప్రాంతాల మనస్తత్వాలు ఒకేలా ఉండాలి.  కానీ తెలంగాణ విధానం వేరు. ఏపీ పద్ధతులు వేరు.  తెలంగాణ చైతన్య రాష్ట్రం. పోరాటాల గడ్డ.  ఇక్కడ కుల రాజకీయాలు చాలా తక్కువ.  ఇక్కడి రాజకీయాలను ప్రజలు శాసిస్తారు.  అదే ఏపీ విషయానికొస్తే రాజకీయాలను కులమే శాసిస్తూ ఉంటుంది.


తెలంగాణలో నైతిక విలువలు తగ్గిన ప్రతి సమయంలోను ప్రజలు మొట్టి కాయలు వేస్తుంటారు. వాటిని గుర్తించి లోపాలను సరిదిద్దుకుంటే ఓకే. లేకపోతే ఏం జరిగిందో అసెంబ్లీ ఎన్నికల్లో చూశాం. వాస్తవానికి తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది.  కానీ సమయానికి ఇవ్వలేదు.  దీంతో పాటు ఉద్యమాన్ని అణచి వేయాలని చూసింది. ఫలితంగా అనేక మంది ఉద్యమకారుల చావులకు కారణం అయిందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.  అందుకే తెలంగాణ ఇచ్చినా ఆ ఆపార్టీకి అధికారం ఇవ్వకుండా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కు పట్టం కట్టారు.

 
ఆ తర్వాత చంద్రబాబు తో కలిసి కాంగ్రెస్  కుయుక్తులు పన్నుతుందని భావించి రెండో సారి కూడా ఆ పార్టీని ఆదరించలేదు.  ఆ తర్వాత అధికార టీఆర్ఎస్(బీఆర్ఎస్) నేతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అహంకార పూరిత వాతావరణం కనిపించింది. దీంతో ప్రజలు ముందు నుంచి అంటే దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ లాంటి ఎన్నికల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు అవేమీ పట్టించుకోలేదు.


దీంతో 2023లో కూటమి కట్టకపోయినా ప్రజలు ఏకపక్ష తీర్పును ఇచ్చారు. అధికార బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మలేదు.  కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. సొంతంగా ప్రజలు తమ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నారు. కుల రాజకీయాలు శాసిస్తున్నాయి. పత్రికల విషయానికొచ్చినా సరే అయితే ఎల్లో మీడియా.. లేకపోతే బ్లూ మీడియా. న్యూట్రల్ పేపర్లు, టీవీలు లేవు.  తెలంగాణలో అంతా న్యూట్రల్ మయం.  నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు.  ఈ న్యూట్రల్ విధానాన్ని తెలంగాణను చూసి ఏపీ ప్రజలు నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: