
1. మెటీరియల్ లేని ఉర్దూ మీడియం నుంచి 9 మందే రాస్తే అందులో ఒకరు టాప్ 50లో ఉంటారు.. 8 వేల మంది రాసిన తెలుగు మీడియం విద్యార్థుల్లో ఒక్కరు కూడా టాప్ 100లో ఉండరా..?
2. టీజీపీఎస్సీ ఇప్పటికి రెండు సార్లు వివరణలు ఇచ్చింది. ఒకటి వెబ్ నోట్.. ఇంకొకటి రిజాయిండర్. కానీ రెండిట్లోనూ ఎక్కడా తెలుగు మీడియం ఇష్యూను ప్రస్తావించనే లేదు.. అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టేనా.. లేకుంటే జవాబు ఇచ్చి ఉండాల్సింది కదా.
3. గ్రూప్ 2 టాప్ 100లో అమ్మాయిలు ముగ్గురే.. గ్రూప్ 2 టాప్ 100లో అమ్మాయిలు 15 మంది.. మరి ఒక్క గ్రూప్ 1 ఒక్క దాంట్లోనే టాప్ 100లో 43 మంది ఎలా వచ్చారు. అందులోనూ టాప్ 10లో ఆరుగురు అమ్మాయిలే.. ఇది కోఠీ సెంటర్ ఎఫెక్టేనా?
4. అసలు ఏ సెంటర్లో ఎవరు ఎగ్జామ్ రాయాలో.. ఆయా కాలేజీ ప్రిన్స్ పాల్ నిర్ణయిస్తాడా.. టీజీపీఎస్సీ నిర్ణయిస్తుందా...
కోఠీ ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలే కావాలని అడిగితే ఒప్పుకుంటారా.. అసలు అలా అడిగినట్టు ఆధారాలు ఉన్నాయా.. రిటన్ గా లేఖ ఇచ్చారా.. ఇస్తే బయటపెట్టాలి..
5. అమ్మాయిలు అంటే ఒకే.. మరి కొన్ని సెంటర్లు కేవలం అబ్బాయిలకే కేటాయించారు.. అసలు అబ్బాయిలకే ప్రత్యేకంగా ఎందుకు సెంటర్ కేటాయించాల్సి వచ్చింది.
6. అసలు ర్యాండమ్ గా కాకుండా.. ఇలా జెండర్ వైజ్ గా.. మీడియం వైజ్ గా.. కొన్నింట్లో మిక్స్ డ్ గా.. ఇలా ఎందుకు ప్రత్యేకంగా వర్గీకరించిన హాల్ టికెట్లు ఇచ్చారు.. ఇదంతా స్కామ్ లో భాగం కాదని ఎలా నమ్మాలి.. అసలు ఇంత వరకూ ఏ సర్వీస్ కమిషన్ అయినా ఇలా వర్గీకరించి పరీక్షలు పెట్టిందా..?
7. ఇన్ని సార్లు అడుగుతున్నా.. ఇంత గొడవ జరుగుతున్నా.. టీజీపీఎస్సీ ఎందుకు... పేరు, మీడియం, డేట్ ఆఫ్ బర్త్, సబ్జక్ట్ వైజ్ గా జీఆర్ ఎల్ ఎందుకు ఇవ్వట్లేదు.. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు?
8. 6 పేపర్లు.. ఒక్కో పేపర్ 150 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్షలు పెడితే.. దాన్ని ఇద్దరు ఎవాల్యూటర్లు దిద్దితే... పక్క పక్కన కూర్చుని రాసిన వాళ్లకు సేమ్ టు సేమ్ మార్కులు రావడం అసంభం.. ఒక వేళ వచ్చినా.. వెయ్యిలో ఒకటో, రెండో వస్తాయి.. మరి 654 మందికి పక్క పక్కన వాళ్లకు సేమ్ మార్కులు ఎలా వస్తాయి..
9. ఏ మీడియం పేపర్లు ఆ మీడియం వాళ్లు దిద్దకుండా బై లింగ్వల్ గా ఎందుకు దిద్దించారు.. ఒకే పరీక్షను మూడు మీడియంలలో రాస్తే.. మూడు మీడియంల్లో రాసిన వారికి సమాన అవకాశం ఉండేలా ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు..?
10. ఏనాడూ కాంపిటేటివ్ డిస్క్సిప్టివ్ పేపర్లు దిద్దిన అనుభవం లేని.. ప్రమోషన్ పై వచ్చిన డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు గ్రూప్ 1 పేపర్లు దిద్దే సామర్థ్యం ఉందా?
11. గ్రూప్ 1, 2, 3 పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిసీ.. జాబ్ క్యాలండర్ ఇవ్వాల్సి ఉందని తెలిసీ.. ఏడాది కూడా పదవీకాలం లేని మహేందర్ రెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు.. అంతకు మించి సమర్థులు దొరకలేదా.. లేక 563 కీలకమైన ఈ పోస్టుల్లో తమ వారిని పెట్టుకునే వ్యూహంలో భాగమా?